కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ కుటుంబం..
- IndiaGlitz, [Saturday,October 17 2020]
కరోనా మహమ్మారి కల్లోలం ఇంకా రేపుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్, సామాన్యులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై పంజా విసురుతూనే ఉంది. కాకపోతే కొద్ది రోజుల క్రితంతో పోలిస్తే కరోనా వ్యాప్తి తగ్గిందనే చెప్పాలి. అదే రీతిన జనాల్లో అవగాహన సైతం పెరిగింది. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ నుంచి దాదాపు ప్రజానీకానికి విముక్తి కల్పించింది. తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా వెల్లడించారు.
తమ కుటుంబం కరోనా బారిన పడిందంటూ వస్తున్న వార్తలు నిజమేనని రాజశేఖర్ వెల్లడించారు. ప్రస్తుతం తాము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని తెలిపారు. ‘‘జీవిత, పిల్లలు, నేను కరోనా బారిన పడ్డామంటూ వస్తున్న వార్తలు నిజమే. ప్రస్తుతం మేము ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాం. పిల్లలిద్దరూ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేను, జీవిత కూడా ప్రస్తుతం బాగానే ఉన్నాం.. త్వరలోనే ఇంటికి వెళ్లిపోతాం’’ అని రాజశేఖర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
The news is true that Jeevitha, Kids and I have tested positive for corona and are currently being treated in the hospital.
— Dr.Rajasekhar (@ActorRajasekhar) October 17, 2020
Both the kids are completely out of it, Jeevitha and I are feeling much better and will be back home soon!
Thank you !