'రాజరథం' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Tuesday,October 03 2017]

తన మొదటి సినిమాతోనే ఆస్కార్‌ అవార్డ్‌ నామినేషన్‌ వరకు వెళ్ళిన దర్శకుడు అనూప్‌ భండారి ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేస్తున్నారు. జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ అధినేత అజయ్‌రెడ్డి గొల్లపల్లి,టాలెంటెడ్‌ డైరెక్టర్‌ భారతీయ సినిమా రంగానికి తన మొదటి చిత్రం 'రంగితరంగ' తో సుపరిచితమైన అనూప్‌ భండారిని 'రాజరథం' చిత్రంతో తెలుగులో పరిచయం చేస్తున్నారు. తెలంగాణలోని గొల్లపల్లి వాస్తవ్యుడైన అజయ్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ తెలుగు సినిమాలను ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పుడు అజయ్‌రెడ్డి తెలుగు, కన్నడ భాషల్లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. తెలుగులో 'రాజరథం' పేరుతో, కన్నడలో 'రాజరథ' పేరుతో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్‌ కామెడీతోపాటు అడ్వెంచర్స్‌ కూడా ఈ చిత్రంలో వుంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అక్టోబర్‌ 2న విడుదల చేశారు.

ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన అజయ్‌రెడ్డి గొల్లపల్లి తెలియజేస్తూ ''ఒక యునీక్‌ సబ్జెక్ట్‌తో సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యాము. ఎక్స్‌ట్రీమ్‌ టాలెంట్‌ కలిగిన రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు అయిన అనూప్‌ భండారిని అప్రోచ్‌ అయ్యాము. అనూప్‌ భండారి గతంలో 'రంగితరంగ' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'రంగితరంగ' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవ్వడమే కాకుండా 2016లో ఆస్కార్‌కి పంపే 305 చిత్రాలల్లో స్తానం పొందటం విశేషం.'రంగితరంగ' చిత్రం 2015 లో 8 IIFA,4 Film fare,7 SIIMA మరియు karnataka state అవార్డులు పొందింది. ఈ చిత్రం Overseas కలెక్షన్స్ లల్లొ రికార్డు బ్రేక్ చేసిన చిత్రంగా చరిత్రకెక్కింది.

ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీలో నటించిన నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి మరోసారి 'రాజరథం' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం తమిళ్‌ హీరో ఆర్యను ఎంపిక చేశాం'' అన్నారు.

దర్శకుడు అనూప్‌ భండారి మాట్లాడుతూ ''ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో వేర్వేరుగా చిత్రీకరించడం జరిగింది. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. ఈ పోస్టర్‌లో హీరో, హీరోయిన్‌, రవిశంకర్‌ ఫస్ట్‌లుక్‌లను రివీల్‌ చేసాం. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ డిఫరెంట్‌గా వుండేలా మా టీమ్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుంది. ఫస్ట్‌లుక్‌లో నిరూప్‌ భండారి టక్సిడోతో స్టైలిష్‌గానూ, అవంతిక శెట్టి ఎల్లో గౌన్‌, హెల్మెట్‌, గొడుగుతో క్యూట్‌గా కనిపిస్తుంది. ప్రముఖ నటుడు రవిశంకర్‌ సరికొత్త హెయిర్‌ స్టైల్‌తో, ట్వీడ్‌ కోట్‌తో స్పెషల్‌గా కనిపిస్తున్నారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌, అనూప్‌ భండారి సతీమణి నీతాశెట్టి ఈ సినిమాకు కాస్ట్యూమ్స్‌ని ప్రత్యేకంగ డిజైన్‌ చేశారు . త్వరలోనే ఆర్యకు సంబంధించిన సోలో లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని'' తెలిపారు.

ఈ చిత్రంలో ఆరు పాటలున్నాయి. ఈ పాటలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. అనూప్‌ భండారి ఈ పాటలకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి మాటలు అబ్బూరి రవి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అజనీష్‌ లోక్‌నాథ్‌, ఎడిటింగ్‌: శాంతకుమార్‌, సినిమాటోగ్రఫీ: విలియమ్‌ డేవిడ్‌, నిర్మాణం: జాలీహిట్స్‌ టీమ్‌ అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్‌శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి, సంగీతం, స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం,: అనూప్‌ భండారి.