ర‌జినీ 168 టైటిల్‌..!!

ద‌ర్బార్ సినిమా త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. వెంట‌నే డైరెక్ట‌ర్ శివ‌తో సినిమాను స్టార్ట్ చేశాడు. ర‌జినీ కాంత్ 168వ చిత్ర‌మిది. హీరోలను మాస్‌గా చూపించడంలో శివ స్పెషలిస్ట్‌. అందుకనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ శివతో వరుసగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసమ్‌ సినిమాలను చేశాడు. ఇప్పుడు రజనీకాంత్‌తో శివ సినిమా అనగా మాస్‌ ఇమేజ్‌ ఉన్న రజనీకాంత్‌ను శివ ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఈ చిత్రానికి 'వ్యూహం' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే ఈ వార్త‌ల‌ను కోలీవుడ్ వ‌ర్గాలు కొట్టిప‌డేశాయి.

తాజా స‌మాచారం ప్రకారం ఈ చిత్రానికి 'అన్నాత్త‌' అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తార‌ని.. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డుతుందట‌. సినిమాలో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌లో నుండే ఈ టైటిల్‌ను తీసుకున్నార‌ని టాక్‌. స‌న్‌పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా త‌ర్వాత ర‌జినీ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుందట‌. శివ సినిమా పూర్తి కాగానే.. అంటే 2020 ద్వితీయార్థంలో ర‌జినీ 169 కూడా స్టార్ట్ అవుతుంద‌ని స‌మాచారం.

More News

రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో బాల‌కృష్ణ‌

కొన్ని కాంబినేష‌న్స్‌పై సినీ ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో భారీ అంచ‌నాలుంటాయి. అలాంటి క్రేజీ కాంబినేష‌న్స్‌లో బాల‌కృష్ణ‌,

'మాస్ట‌ర్' రిలీజ్ డేట్‌.. ప్లాన్ అదే!

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మాస్ట‌ర్‌`.

`డబ్‌శ్మాష్‌` త‌ప్ప‌కుండా పెద్ద విజ‌యం సాధిస్తుంది - చిత్ర స‌మ‌ర్ప‌కులు సుబ్రమణ్యం మలసాని

వీత్రి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ నిర్మాతగా  పవన్ కృష్ణ, సుప్రజ,  హీరో హీరోయిన్లుగా గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `డబ్‌శ్మాష్‌`.

'సీటీమార్‌' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!!

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ 'వి'.. సుధీర్‌బాబు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `వి`. తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి