రిపబ్లిక్ గిఫ్ట్ రెడీ చేస్తున్న రాజమౌళి

ద‌ర్శ‌కధీరుడు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న పిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇందులో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తుంటే, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు సంబంధించిన క‌ల్పిత క‌థాంశంతో రూపొందుతోన్న చిత్రం. స్వాతంత్య్ర కోసం పాటు ప‌డ్డ ఇద్ద‌రు వీరులు కాబ‌ట్టి.. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ జ‌న‌వ‌రి 26న గ‌ణ తంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌, భీమ్ ఫ‌ర్ రామ‌రాజు, రామ‌రాజు ఫ‌ర్ భీమ్ వీడియో ప్రోమోలు ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌ను రాబట్ట‌కున్నాయి. మ‌రి ఈసారి టీజ‌ర్‌లో ఇద్ద‌రినీ ఒకేసారి చూపించి అటు నంద‌మూరి అభిమానుల‌ను, ఇటు మెగాభిమానుల‌ను రాజ‌మౌళి మెప్పిస్తాడేమో చూడాలి.

ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు ఇతర కీలకపాత్రల్లో నటిస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్‌, ఒలివియా మోరిస్, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్‌ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు.

More News

తేజ సినిమా నుండి తప్పుకున్న గోపీచంద్

హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ ఒకానొక ద‌శ‌లో స‌క్సెస్‌లు లేక ఖాళీగా కూర్చుంటే డైరెక్ట‌ర్ తేజ త‌న‌ని జ‌యం, నిజం వంటి సినిమాల్లో విల‌న్‌గా చూపించి త‌న‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చి

‘నల్లమల’మోషన్ పోస్టర్ విడుదల

కొన్ని కథలు తెరకెక్కించాలంటే గట్స్ కావాలి. అలాంటి గట్స్ తోనే రూపొందుతోన్న సినిమా ‘నల్లమల’.ఇప్పటికే సేవ్ నల్లమల అనే నినాదంతో

ఆ రెండింటినీ ఒకేసారి పట్టాలెక్కించనున్న పవన్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతోంది.

జనవరి 1న 'కాళికా' చిత్రం విడుదల

నట్టి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో క్వీటీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రాధికా కుమరస్వామి,సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా

తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు.. హైకోర్టు ఫైర్..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. నూతన సంవత్సర వేడుకలను బ్యాన్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.