అడవుల్లో రాజమౌళికి ఏం పని?
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్డౌన్ సమయంలో దాదాపు ఇల్లు, ఫాంహౌస్‌కే పరిమితమైన దర్శకధీరుడు రాజమౌళి, కీరవాణి కుటుంబ సభ్యుల్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారు ఆరోగ్యాన్ని బాగు చేసుకుని కరోనా వారియర్స్‌గా రిటర్న్ బ్యాక్ అయ్యారు. ఇప్పుడిప్పుడు రాజమౌళి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఓ చిన్న బ్రేక్ తీసుకున్నారు. సినిమాలు, ఇతర ఆలోచనలకు దూరంగా చిన్న ట్రిప్ ప్లాన్ చేశారు. అది కూడా మన పక్క రాష్ట్రమైన కర్ణాటక అడవుల్లో కావడం విశేషం. ఈ మధ్య మన సెలబ్రిటీలందరూ విరామం కావాలనుకున్నప్పుడు అడవి బాట పడుతున్నారు. ఆ మధ్య తమన్నా పచ్చదనంలో తాను ట్రావెల్ చేశానని చెప్పిన సంగతి తెలసిందే. అలాగే రీసెంట్గా బన్నీ కూడా ఆదిలాబాద్ కుంటాల జలపాతంను కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించాడు. ఇప్పుడు వీరి బాటలో జక్కన్న కూడా అడవుల బాట పట్టారు.
వివరాల్లోకెళ్తే భార్య రమా రాజమౌళితో కలిసి రాజమౌళి.. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ ఫారెస్ట్‌ను సందర్శించారు. అటవీశాఖ సంరక్షణాధికారుల సాయంతో అక్కడే ఓ రిసార్ట్‌లో వారు స్టే చేశారు. అలాగే ఫారెస్ట్ అధికారుల వాహనంలోనే అడవిలోకి వెళితే వారికి పులులేవీ కనిపించలేదని, ఏనుగులు కొన్ని ఇతర జంతువులు మాత్రమే కనిపించాయట. ఈ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్లడానికి ముందు అక్కడికి దగ్గరలోని హిమవద్ గోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com