ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై రాజమౌళి అసంతృప్తి.. విదేశీయులు ఇలాంటివి చూస్తే..
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి చాలా కూల్ గా ఉంటారు. ఎప్పుడూ తన వర్క్ పనే ఫోకస్ పెడతారు. బయట విషయాలని అంతగా పట్టించుకోరు. కానీ అలాంటి రాజమౌళికి కూడా చిన్నపాటి కోపం, అసంతృప్తి కలిగాయి. జక్కన్న అసంతృప్తికి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కారణం అయింది.
దేశ రాజధాని నగరంలో విమానాశ్రయం అంటే చాలా ప్రత్యేకంగా, అందంగా, ప్రతిష్టాత్మకంగా ఉండాలి. కానీ అక్కడ పరిస్థితులు రాజమౌళికి అలా కనిపించలేదు. వెంటనే ట్విటర్ లో తన అసంతృప్తిని తెలియజేస్తూ విమానాశ్రయ అధికారులకు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: సమ్మర్ వైబ్స్ అంటూ అందాల బాంబు.. ప్యాంట్ అన్ జిప్, మరీ ఇంత బోల్డా!
'డియర్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్.. నేను ఈ తెల్లవారుజామున 1 గంటకు లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ద్వారా ఢిల్లీలో దిగాను. ప్రయాణికులందరికీ ఆర్ టి పిసిఆర్ టెస్ట్ వివరాలు రాయమని పత్రాలు ఇచ్చారు. ప్రయాణికులంతా అక్కడ ఫ్లోర్ పై కూర్చుని రాయడానికి ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది కూర్చోలేక గోడలకు అనుకుంటున్నారు. చూడడానికి ఇదేం బాగాలేదు. టేబుల్స్ ఏర్పాటు చేయడం కనీస బాధ్యత.
అలాగే ఎగ్జిట్ గేట్ వద్ద విచ్చలవిడిగా కుక్కలు ఉన్నాయి. ఇండియాకు తొలిసారి వచ్చే విదేశీయులు ఇలాంటివి చూస్తే మంచి ఫస్ట్ ఇంప్రెషన్ కలగదు. ఈ అంశాలపై దృష్టి పెట్టండి' అని రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు సుతి మెత్తగా చురకలంటించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి.
Dear @DelhiAirport,
— rajamouli ss (@ssrajamouli) July 2, 2021
arrived at 1 AM by lufthanasa flight. Forms were given to fill for the RT PcR test. All the passenges are sitting on the floors or propping against the walls to fill the forms. Not a pretty sight. Providing tables is a simple service.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments