ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై రాజమౌళి అసంతృప్తి.. విదేశీయులు ఇలాంటివి చూస్తే..

దర్శకధీరుడు రాజమౌళి చాలా కూల్ గా ఉంటారు. ఎప్పుడూ తన వర్క్ పనే ఫోకస్ పెడతారు. బయట విషయాలని అంతగా పట్టించుకోరు. కానీ అలాంటి రాజమౌళికి కూడా చిన్నపాటి కోపం, అసంతృప్తి కలిగాయి. జక్కన్న అసంతృప్తికి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కారణం అయింది.

దేశ రాజధాని నగరంలో విమానాశ్రయం అంటే చాలా ప్రత్యేకంగా, అందంగా, ప్రతిష్టాత్మకంగా ఉండాలి. కానీ అక్కడ పరిస్థితులు రాజమౌళికి అలా కనిపించలేదు. వెంటనే ట్విటర్ లో తన అసంతృప్తిని తెలియజేస్తూ విమానాశ్రయ అధికారులకు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: సమ్మర్ వైబ్స్ అంటూ అందాల బాంబు.. ప్యాంట్ అన్ జిప్, మరీ ఇంత బోల్డా!

'డియర్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్.. నేను ఈ తెల్లవారుజామున 1 గంటకు లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ద్వారా ఢిల్లీలో దిగాను. ప్రయాణికులందరికీ ఆర్ టి పిసిఆర్ టెస్ట్ వివరాలు రాయమని పత్రాలు ఇచ్చారు. ప్రయాణికులంతా అక్కడ ఫ్లోర్ పై కూర్చుని రాయడానికి ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది కూర్చోలేక గోడలకు అనుకుంటున్నారు. చూడడానికి ఇదేం బాగాలేదు. టేబుల్స్ ఏర్పాటు చేయడం కనీస బాధ్యత.

అలాగే ఎగ్జిట్ గేట్ వద్ద విచ్చలవిడిగా కుక్కలు ఉన్నాయి. ఇండియాకు తొలిసారి వచ్చే విదేశీయులు ఇలాంటివి చూస్తే మంచి ఫస్ట్ ఇంప్రెషన్ కలగదు. ఈ అంశాలపై దృష్టి పెట్టండి' అని రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు సుతి మెత్తగా చురకలంటించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి.

More News

హోప్ ఇస్తున్న జె అండ్ జె కోవిడ్ వ్యాక్సిన్.. కేవలం సింగిల్ డోస్ లోనే..

అమెరికాలోని అగ్రగామి మెడికల్ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ తీపి కబురు చెప్పింది. కరోనా వైరస్ ప్రపంచానికి పెను శాపంగా మారింది.

'రిచి  గాడి పెళ్లి' చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను  విడుదల చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

కె  ఏస్ ఫిల్మ్ వర్క్స్  పతాకంపై  నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ నటీనటులు గా కె  ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో

సమ్మర్ వైబ్స్ అంటూ అందాల బాంబు.. ప్యాంట్ అన్ జిప్, మరీ ఇంత బోల్డా!

స్టన్నింగ్ బ్యూటీ అమీషా పటేల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమె నాటీ ఫోజులు నిత్యం వైరల్ అవుతున్నాయి.

'యాత్ర' సీక్వెల్: వైఎస్ జగన్ బయోపిక్ లో బాలీవుడ్ నటుడు ఖరారు

మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యాత్ర' చిత్రం ఆకట్టుకుంది. ఆ చిత్రంతో వైఎస్ఆర్ అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందారు.

డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి నటన వైపు.. అల్లు రామలింగయ్య టూ సాయి పల్లవి

చాలా మంది ప్రముఖులు వారి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలిపెట్టి సినిమాల్లో సెటిల్ అయ్యారు.