తాత అయిన వ‌ర్మ‌.. రాజ‌మౌళి ట్వీట్‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మాట్లాడే మాట‌లు వింటే అస‌లు బంధాలు, బాంధ‌వ్యాలు పైన ఎలాంటి న‌మ్మ‌కం లేని వ్య‌క్తితో మ‌నం మాట్లాడుతున్న‌ట్లు అనిపిస్తుంది. అలాంటి డైరెక్ట‌ర్ ఇప్పుడు తాత‌గా మారాడు. తాత ఎంత పెద్దోడు అయినా... మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వరాళ్లు మీస‌లు ప‌ట్టుకు ఆడిస్తార‌ని మ‌నం వినే ఉంటాం.

మ‌రిప్పుడు వ‌ర్మ ప‌రిస్థితి కూడా అదేనా! .. అంటే అవున‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. ఆదివారం వ‌ర్మ కుమార్తె అమెరికాలో ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని వ‌ర్మ ఎక్క‌డా చెప్ప‌క‌పోయినా వార్త మాత్రం సోష‌ల్ మీడియాలో లీకైంది. ఇప్పుడ‌దే హాట్ టాపిక్‌గా మారి చ‌క్క‌ర్లు కొడుతుంది. దీనిపై స్పందించిన రాజ‌మౌళి ‘‘ అభినందనలు రాము తాత‌గారు. మీకు క‌ళ్లెం వేయ‌బోతున్న మీ మ‌న‌వ‌రాలికి నా అభినంద‌న‌లు. మ‌రి మీకేం కావాలి రాము నాన్నా లేక రాము తాత‌య్య‌’’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై వర్మ మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.

రామ్‌గోపాల్ వ‌ర్మ కుమార్తె రేవ‌తి డాక్ట‌ర్‌. 2013లో..ఈమె డాక్ట‌ర్ ప్ర‌ణ‌వ్‌ను వివాహం చేసుకున్నారు. హైద‌రాబాద్‌లో వీరి పెళ్లి జ‌రిగింది. ఆరేళ్ల త‌ర్వాత వీరికి పాప పుట్టింది.

More News

సింగర్‌ మనోపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

మీటూ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు దక్షిణాదిలో సింగర్‌ చిన్మయి రైటర్‌ వైరముత్తుపై చేసిన ఆరోపణలు సంచలనాలకు దారి తీశాయి.

ఇండియ‌న్ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'ఫ్రెండ్ షిప్'

ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేశారు.

రాహు శాటిలైట్ & డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న జి తెలుగు

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

45 ల‌క్ష‌ల మోసం.. యాంక‌ర్ రవి కంప్లైంట్‌

బుల్లి తెర‌పై షోస్ ద్వారా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ ర‌వి ఇది మా ప్రేమ‌క‌థ అనే చిత్రంలోనూ న‌టించారు.

మార్చి 6న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు విడుదల తేదీ మార్చి 6 అయ్యింది.