రాజమౌళి కూడా ఫాలో అవుతున్నాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకథీరుడు రాజమౌళి కూడా ఫాలో అవుతున్నాడు... ఇంతకీ ఏం ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారా..? ట‌్రెండ్ ఫాలో అవుతున్నాడు. అసలు విషయం ఏమిటంటే...రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి లో అద్భుతమైన సెట్టింగ్స్, థ్రిల్ కలిగించే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి కానీ... కామెడి లేదు. ప్రజెంట్ నడుస్తున్న ట్రెండే అది. అలాంటిది కామెడి లేకపోతే ఎలా...? అనుకున్నాడనుకుంట జక్కన్న...అంతే...ట్రెండ్ ఫాలో అవుతూ బాహుబలి 2 లో 30 ఇయర్స్ ప్రుథ్వీ తో కామెడి చేయిస్తున్నారట.
ప్రస్తుతం 30 ఇయర్స్ ప్రుథ్వీ రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న బాహుబలి 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో నాలుగు రోజులు పాటు ప్రుథ్వీ పై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాహుబలి ని మించి రికార్డు స్ధాయి కలెక్షన్స్ సాధించేలా రాజమౌళి రూపొందిస్తున్న బాహుబలి 2 తో 30 ఇయర్స్ ప్రుథ్వీ కి మరింత క్రేజ్ రావడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com