రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం కొత్తగా ఆలోచించాలి: ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళి క్రియేటివిటీ వల్ల ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ . ఈ సినిమా కోసం రాజమౌళి ఇప్పుడు తన రూట్ మార్చుకోవాలన్నారు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ. ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ ‘పవర్‌స్టార్’ సినిమాను తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే అంత కంటే ముందు ‘పవర్‌స్టార్’ ట్రైలర్‌ను ఈ నెల 22న విడుదల చేస్తానని, ట్రైలర్ చూడాలనుకుంటే రూ.25 చెల్లించాలనే కండీషన్ పెట్టాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన వర్మ రాజమౌళిని, ‘ఆర్ఆర్ఆర్’ను మధ్యలోకి లాగాడు.
‘‘మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను రూపొందిస్తోన్న రాజమౌళి కొత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి ప్రపంచమంతా మారుతుంది. రాజమౌళి నువ్వు కూడా మారుతున్న కాలంతో పాటు కొత్తగా ఆలోచించాలి. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే అందరూ డబ్బులు చెల్లించి ఆ ట్రైలర్‌ను చూస్తారు. సినిమాకు ఎంత చెల్లిస్తారో అంత కూడా చెల్లించడానికి ప్రేక్షకులకు సిద్ధంగా ఉన్నారు. సినిమా కంటే ట్రైలర్‌పైనే ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను బాహుబలి చూసిన ప్రేక్షకులు చూస్తే చాలు.. నిర్మాతకు సినిమా విడుదల కంటే ముందే లాభాలు వచ్చేస్తాయి’’ అని వర్మ ట్వీట్స్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments