రాజమౌళి ఆనవాయితీ.. చరణ్, ఎన్టీఆర్ విధ్వంసం ఊహకి కూడా అందదా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఐదేళ్లపాటు రాజమౌళి కష్టపడి తీర్చిదిద్దిన బాహుబలి రెండు భాగాలని చూసి ఆనందించాం.. విజువల వండర్ అని మురిసిపోయాం. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వంతు. బాహుబలిని మించేలా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. రాజమౌళి ఆ దిశగానే ప్రయత్నం చేస్తుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. కానీ విడుదల విషయంలో కరోనా కారణంగా అనిశ్చితి నెలకొని ఉంది.
కానీ సినిమాపై మాత్రం రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. రాజమౌళి సినిమాల్లో ఉండే విశేషాలు ఆర్ఆర్ఆర్ లో కూడా ఉంటాయని అభిమానులు నమ్ముతున్నారు. కానీ ఓ ప్రత్యేక అంశం అందరిని ఆసక్తికిగురిచేస్తోంది. అదే రాజమౌళి సినిమాల్లో ఆనవాయితీగా కొనసాగే ఆయుధాలు. రాజమౌళి గత చిత్రాలు, వాటిలో ఉన్న ఆయుధాల్ని ఒకసారి నెమరు వేసుకుందాం..
సింహాద్రి
సింహాద్రి చిత్రంలో గొడ్డలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో ఎన్టీఆర్ గొడ్డలి పట్టుకుని చేసే ఫైట్ గూస్ బంప్స్ అంతే. టైటిల్ లోగోలో కూడా ఎన్టీఆర్ ఉగ్రరూపంతో గొడ్డలి పట్టుకుని కనిపిస్తాడు.
ఛత్రపతి
ఈ చిత్రంలో కూడా రాజమౌళి ప్రభాస్ కోసం డిజైన్ చేయించిన వెపన్ గొడ్డలి తరహాలోనే ఉంటుంది. చూడడానికి గొడ్డలిలా అనిపించినా ఆ ఆయుధం విభిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలో కూడా ప్రభాస్ ఇంటర్వెల్ సన్నివేశంలో ఆ ఆయుధంతో విలయతాండవమే చేస్తాడు. బాజీ రావుని చంపేసి కోట శ్రీనివాసరావు వద్దకు వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ విజిల్స్ కొట్టించే విధంగా ఉంటుంది.
విక్రమార్కుడు
సింహాద్రి, ఛత్రపతి తరహాలోనే విక్రమార్కుడులో కూడా ఇంటర్వెల్ సన్నివేశంలోనే రాజమౌళి ఆయుధం బయటకు వస్తుంది. రాడ్ కు చివర గిర్రున తిరిగే చక్రం, ఆ చక్రానికి పదునైన మొనలు ఉండే ఆయుధాన్ని రాజమౌళి ఈ చిత్రంలో ఉపయోగించారు.
మగధీర
మగధీర చిత్రంలో సైన్యాధ్యక్షుడి హోదాలో రాంచరణ్ ఖడ్గన్నే ఉపయోగిస్తాడు. విలన్ కి మాత్రం కాస్త విభిన్నంగా ఉండే ఆయుధాన్ని ఉపయోగించారు.
ఈగ
ఈగకు ఆయుధం ఏముంటుంది అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడున్నది రాజమౌళి. ఈగ కోసం గుండు సూదిని ఆయుధంగా చూపించారు.
బాహుబలి
బాహుబలిలో హీరో కంటే విలన్ భల్లాల దేవుడి ఆయుధమే అందరిని ఆకర్షించింది. రానా ఉపయోగించే గధమునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది. గధ చివరి భాగాన్ని దూరంగా విసిరేలా చైన్ తో వెసులుబాటు ఉంటుంది. మళ్ళీ తిరిగి యథాస్థానంలోకి వచ్చే విధంగా అమరిక ఉంటుంది. ఈ గధ తోనే భల్లాలుడు మదించిన ఏనుగుని సైతం ఒక్క దెబ్బతో చంపేస్తాడు. ఇక ప్రభాస్ మాత్రం సందర్భానుసారంగా కత్తి, ధనుస్సు లాంటి ఆయుధాల్ని చిత్రంలో ఉపయోగిస్తుంటాడు.
నెక్స్ట్ ఆర్ ఆర్ఆర్
ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే రాంచరణ్ నిప్పుని, ఎన్టీఆర్ నీరని ఇప్పటికే ఓ హింట్ ఇచ్చారు. నిప్పు, నీరు ఉగ్రరూపం దాల్చితే ఏమీ మిగలదు. దీనిని బట్టే ఊహించుకోవచ్చు చరణ్, ఎన్టీఆర్ చేసే విధ్వంసం మన ఊహకి కూడా అందదని. కానీ వీరిద్దరూ సినిమాలో ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తారు అనేదే ఆసక్తి. సాధారణంగా చరణ్ అల్లూరి పాత్ర చేస్తున్నాడు కాబట్టి ధనుస్సు ఉపయోగిస్తుంటాడు. ప్రచార చిత్రాల్లో కూడా అదే చూపించారు. కొమరం భీం అయితే తన పోరాటంలో తుపాకిని ఉపయోగించారు. కానీ రామరాజు ఫర్ భీం వీడియోలో ఎన్టీఆర్ బల్లెం పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇవి కాకుండా రాజమౌళి సినిమాలో సర్ ప్రైజింగ్ గా వెరైటీ ఆయుధాల్ని సిద్ధం చేసి ఉంటారనేది ఫ్యాన్స్ నమ్మకం. ఈ సంగతి తేలేది ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాకే. అప్పటి వరకు వేచి చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com