తారక్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పిన జక్కన్న
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఎంటైర్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా లాక్డౌన్ కారణంగా షూటింగ్‌ను ఆపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడు స్టార్స్ సినిమాల షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తరుణంలో జక్కన్న తన టీమ్‌కు రెడీ అవమని సంకేతాలు ఇచ్చేశాడు. త్వరలోనే సినిమా రీ స్టార్ట్ కానుంది.
రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తారక్ ఫ్యాన్స్ కూడా తమ హీరో చేస్తున్న కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన ప్రోమోను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారని భావించారు. కానీ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ మిగిలే ఉండటంతో జక్కన్న తారక్ ప్రోమోను విడుదల చేయలేదు. షూటింగ్‌ను రీస్టార్ట్ చేసిన కొన్నిరోజులకే తారక్ ప్రోమో విడుదలవుతుందని వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్, ప్రోమోను వీలైనంత త్వరగా విడుదల చేస్తామని, అందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను కూడా చేస్తామని జక్కన్న తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com