తార‌క్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పిన జ‌క్క‌న్న

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ ఫిక్ష‌నల్ పీరియాడిక‌ల్ డ్రామాలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌ను ఆపేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడు స్టార్స్ సినిమాల షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న త‌రుణంలో జ‌క్క‌న్న త‌న టీమ్‌కు రెడీ అవ‌మ‌ని సంకేతాలు ఇచ్చేశాడు. త్వ‌ర‌లోనే సినిమా రీ స్టార్ట్ కానుంది.

రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌కు సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. తార‌క్ ఫ్యాన్స్ కూడా త‌మ హీరో చేస్తున్న కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన ప్రోమోను ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ని భావించారు. కానీ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ మిగిలే ఉండ‌టంతో జ‌క్క‌న్న తార‌క్ ప్రోమోను విడుద‌ల చేయ‌లేదు. షూటింగ్‌ను రీస్టార్ట్ చేసిన కొన్నిరోజులకే తార‌క్ ప్రోమో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వినిపిస్తోన్న నేప‌థ్యంలో రీసెంట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తార‌క్‌, ప్రోమోను వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేస్తామ‌ని, అందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను కూడా చేస్తామ‌ని జ‌క్క‌న్న తెలిపారు.

More News

అందువల్లే మాళవికా నాయర్‌ ని తీసుకున్నాం: విజయ్‌కుమార్ కొండా

తొలి చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే`‌తో సెన్సేషనల్‌ హిట్ సాధించి రెండో చిత్రం 'ఒకలైలాకోసం' వంటి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరితో కమర్షియల్‌ హిట్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ కొండా.

నాకు కరోనా సోకలేదు.. ఆరోగ్యంగానే ఉన్నా: ప్రభు

కరోనా కాలం నడుస్తోంది. మనకు తెలిసిన మనిషి కొద్ది రోజుల పాటు కనిపించలేదంటే ఖతం.. కరోనా వచ్చిందంటూ క్వారంటైన్‌లో ఉన్నాడంటూ ప్రచారం మొదలవుతోంది.

క్వారంటైన్‌‌కు వెళ్లనున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం.. నెలాఖరులో షూటింగ్..!

కరోనా దెబ్బకు ఆగిపోయిన సినిమాలన్నీ క్రమక్రమంగా షూటింగ్ బాట పడుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పైనే ఉంది.

అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ వీక్షకులకు థ్రిల్ ఇస్తున్న 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్' ట్రైలర్

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'‌.

ఏపీ సీఎం జగన్ మామ గంగిరెడ్డి మృతి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన మామ, వైఎస్ భారతిరెడ్డి తండ్రి అయిన ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు.