హాట్ టాపిక్ గా మారిన రాజమౌళి రెమ్యూనరేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీర రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి. ఈ సంచలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో బాహుబలి తర్వాత రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సాధించిన విజయం దృష్టిలో పెట్టుకుని బాహుబలి 2 చిత్రాన్నిరాజమౌళి మరింత భారీ స్ధాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే....బాహుబలి 2 కు రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ప్రజెంట్ హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ రాజమౌళి ఎంత తీసుకుంటున్నాడు అంటే...బాహుబలి 2 తెలుగు వెర్షెన్ కాకుండా మిగిలిన భాషల్లో బాహుబలి 2 చిత్రాన్ని ఎంతకు అమ్ముతారో అందులో సగం తనకు ఇవ్వాలని రాజమౌళి నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతుంది. తమిళ్, మలయాళం, హిందీ వెర్షెన్స్ కలిపి బాహుబలి 2 చిత్రానికి 150 నుంచి 200 కోట్లు బిజినెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం రాజమౌళి రెమ్యూనరేషన్ దాదాపు 100 కోట్లు అని ప్రచారం జరుగుతుంది. మరి...ఈ ప్రచారం పై రాజమౌళి స్పందిస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments