జ్యోఅచ్యుతానంద గురించి రాజమౌళి రివ్యూ..!

  • IndiaGlitz, [Friday,September 09 2016]

నారా రోహిత్ - నాగ శౌర్య - రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ జ్యోఅచ్యుతానంద‌. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయికొర్ర‌పాటి నిర్మించారు. ఈ చిత్రం ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్ర నిర్మాత సాయి కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి ఇద్ద‌రికి మంచి అనుబంధం ఉంది. అందుచేత త‌ప్ప‌కుండా రాజ‌మౌళి ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తారు అనుకున్నాం. ఊహించిన‌ట్టేగానే...రాజ‌మౌళి జ్యోఅచ్యుతానంద పై రివ్యూ ఇచ్చేసారు.
ఇంత‌కీ రాజ‌మౌళి ట్విట్ట‌ర్ లో ఏమ‌న్నారంటే...అవ‌స‌రాల శ్రీనివాస్, వారాహి చ‌ల‌న‌చిత్ర‌, క‌ళ్యాణ ర‌మ‌ణ కాంబినేష‌న్లో వ‌చ్చిన మ‌రో ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ జ్యోఅచ్యుతానంద‌. క్లైమాక్స్ లో నారా రోహిత్, నాగ శౌర్య అన్న‌ద‌మ్ములుగా చాలా బాగా న‌టించారు. రెజీనా ని ఫ‌స్ట్ టైమ్ తెర పై చూసాను. న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. వెంక‌ట్ ఫోటోగ్ర‌ఫీ ఈ చిత్రానికి ప్ర‌త్యేక‌కార్ష‌ణ‌గా నిలిచింది. అలాగే ఆర్ట్ డైరెక్ట‌ర్ రామా పుట్ వ‌ర్క్ చాలా బాగుంది. ఈ చిత్రంలో చివ‌రికి మిగిలేది అనే పుస్త‌కాన్ని చూపించిన విధాన‌మే దీనికి ఉదాహ‌ర‌ణ‌. అంద‌రికీ అభినంద‌న‌లు అంటూ త‌న రివ్యూ ఇచ్చేసారు.