ఆ సీన్ చూస్తున్నప్పుడు.. ‘‘ఊపిరి తీసుకోలేరు, హార్ట్‌బీట్ పరిగెడుతుంది’’ : ఆర్ఆర్ఆర్‌పై జక్కన్క కామెంట్స్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ రిలీజ్ అవుతుందని అంతా భావించిన వేళ.. కోవిడ్ రక్కసి కారణంగా సినిమా వాయిదాపడింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభణకు తోడు ఆంక్షలు, నైట్‌కర్ఫ్యూలు విధించడంతో ఈ పరిస్ధితుల్లో సినిమాను విడుదల చేస్తే నష్టపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది ‘‘ఆర్ఆర్ఆర్’’. ఒకవేళ విడుదలయ్యుంటే ఈ సినిమా రికార్డులు, వసూళ్లు, సాధించిన ఘన విజయాల గురించి ప్రపంచం మాట్లాడుకుంటూ వుండేది. అయితే జనవరి 7న సినిమా రిలీజ్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రమోషనల్ ఈవెంట్ల కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల మధ్య చక్కర్లు కొట్టింది.
దీనిలో భాగంగా డిసెంబర్ లో ముంబై వేదికగా 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ దీనికి హోస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఓ సీన్ వస్తుందని.. అది స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు నరాలు బిగుసుకుపోతాయని.. ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారని.. హార్ట్ బీట్ పెరిగిపోతుందని చెప్పారు జక్కన్న. ఇప్పటివరకు ఏ ప్రోమోలో కూడా దీని గురించి హింట్ ఇవ్వలేదని.. ఆ సీన్‌ను థియేటర్లో చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే సీక్రెట్‌గా వుంచినట్లు రాజమౌళి తెలిపారు. జక్కన్న ఈ రేంజ్‌లో చెప్పాడంటే .. మరి ఆ సీన్ ఏ రేంజ్‌లో వుంటుందో . మరి ఇది చూడాలంటే మార్చి 25 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments