ఆ సీన్ చూస్తున్నప్పుడు.. ‘‘ఊపిరి తీసుకోలేరు, హార్ట్‌బీట్ పరిగెడుతుంది’’ : ఆర్ఆర్ఆర్‌పై జక్కన్క కామెంట్స్ వైరల్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ రిలీజ్ అవుతుందని అంతా భావించిన వేళ.. కోవిడ్ రక్కసి కారణంగా సినిమా వాయిదాపడింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభణకు తోడు ఆంక్షలు, నైట్‌కర్ఫ్యూలు విధించడంతో ఈ పరిస్ధితుల్లో సినిమాను విడుదల చేస్తే నష్టపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది ‘‘ఆర్ఆర్ఆర్’’. ఒకవేళ విడుదలయ్యుంటే ఈ సినిమా రికార్డులు, వసూళ్లు, సాధించిన ఘన విజయాల గురించి ప్రపంచం మాట్లాడుకుంటూ వుండేది. అయితే జనవరి 7న సినిమా రిలీజ్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రమోషనల్ ఈవెంట్ల కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల మధ్య చక్కర్లు కొట్టింది.

దీనిలో భాగంగా డిసెంబర్ లో ముంబై వేదికగా 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ దీనికి హోస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఓ సీన్ వస్తుందని.. అది స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు నరాలు బిగుసుకుపోతాయని.. ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారని.. హార్ట్ బీట్ పెరిగిపోతుందని చెప్పారు జక్కన్న. ఇప్పటివరకు ఏ ప్రోమోలో కూడా దీని గురించి హింట్ ఇవ్వలేదని.. ఆ సీన్‌ను థియేటర్లో చూసినప్పుడు ఎగ్జైట్మెంట్‌ మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే సీక్రెట్‌గా వుంచినట్లు రాజమౌళి తెలిపారు. జక్కన్న ఈ రేంజ్‌లో చెప్పాడంటే .. మరి ఆ సీన్ ఏ రేంజ్‌లో వుంటుందో . మరి ఇది చూడాలంటే మార్చి 25 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

More News

ఆ యాడ్ కోసం మహేశ్ అంత తీసుకున్నాడా..?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. పాలవంటి తెల్లని మేయని ఛాయతో గ్రీకు రాకుమారుడిలా కనిపించే ఆయనంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు.

మహాభారత్‌లో ‘భీముడు’ ప్రవీణ్ కుమార్ ఇక లేరు

ఓ 30 ఏళ్లు వెనక్కి వెళితే.. అప్పుడప్పుడే భారత్‌లో టీవీలు రంగ ప్రవేశం చేస్తున్న  కాలం. దూరదర్శన్ తప్పించి మరో ఛానెల్ లేని సమయం.

‘‘ క్యాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో’’ : ఎఫ్ 3 మూవీ నుంచి 'లబ్‌ డబ్‌ ' సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’ మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా.

అసద్‌జీ.. ‘‘జడ్’’ కేటగిరీ సెక్యూరిటీ తీసుకోండి:  ఒవైసీని కోరిన అమిత్ షా

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.

‘జనగణమన’ ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చేసిన పూరి, తన గొంతుతోనే చెప్పేశాడుగా

‘‘ జనగణమన’’.. దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. పవన్ కల్యాణ్, మహేశ్ బాబులలో ఒకరితో ఈ సినిమాను పట్టాలెక్కించాలన్నది పూరి   ప్లాన్.