వర్మను బతిమాలుకున్న రాజమౌళి...
Send us your feedback to audioarticles@vaarta.com
`బాహుబలి 2` సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి అండ్ టీం ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. సాధారణంగా కొత్త సినిమాలను, పెద్ద పెద్ద డైరెక్టర్స్, స్టార్ హీరోలను వివాదంలోకి లాగే రాంగోపాల్ వర్మ, బాలీవుడ్ కమాల్ ఆర్.ఖాన్‌లు రాజమౌళిని సెంటర్ చేసే ప్రయత్నం చేశారు. వర్మ, రాజమౌళితో ఉన్న ఫోటోను షేర్ చేసి రాజమౌళి చాలా అందంగా ఉన్నాడు.
నేను ఆసహ్యంగా ఉన్నాను అని ట్వీట్ చేశాడు. మధ్యలో వెలుపెట్టి రచ్చ చేసే కమాల్ ఆర్.ఖాన్ ఇద్దరూ గొప్ప దర్శకులే. ఇద్దరు ఆసహ్యంగా ఉన్నారంటూ కామెట్ చేశాడు. దానికి ప్రతిగా వర్మ అందరూ మీ అంత, షారూక్ అంత అందంగా ఉండరు కదా అని అన్నాడు. షారూక్ గురించి నాకు తెలియదు కానీ, తాను స్మార్ట్‌గా ఉంటానని తనకు తెలుసునని కమాల్ ఆర్.ఖాన్ అన్నాడు. అసలు ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందోనని అనుకున్నాడో ఏమో వెంటనే రాజమౌళి బాబూ..నన్ను ఒగ్గెయండయ్యా అంటూ ట్వీట్ పెట్టడంతో డిస్కషన్ అంతటితో ఆగిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com