ఇంతకంటే ఇంకేం కావాలి - రాజమౌళి

  • IndiaGlitz, [Monday,May 01 2017]

రాజ‌మౌళి ఇంత‌కంటే ఇంకేం కావాలి అన్నాడంటే ఎంతో ఆనందించ‌ద‌గ్గ విష‌య‌మే అయ్యుంటుంది. అదేంటంటే త‌లైవా, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అభినంద‌నే కార‌ణ‌మట‌. బాహుబ‌లి -2 సినిమాను చూసిన రజ‌నీకాంత్ బాహుబ‌లి సినిమా ఇండియ‌న్ సినిమాకే గ‌ర్వ‌కార‌ణం. ఇంత గొప్ప సినిమాను తీసిన రాజ‌మౌళి నిజంగా దేవుడి బిడ్డే.. రాజ‌మౌళి అండ్ టీంకు సెల్యూట్ అంటూ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా టీమ్‌కు విషెష్ చెప్పాడు. ఈ విషెష్ చూసిన రాజ‌మౌళి కూడా త‌న స్పంద‌న‌ను ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. త‌లైవా ఆశీర్వాదం అంటే దేవుడు ఆశీర్వాద‌మే, ఇంత‌కంటే ఆనందం ఇంకేం ఉంటుందంటూ త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశాడు.