రాజమౌళి రిలీజ్ చేసిన రాఘవేంద్ర రావు ఫస్ట్ లుక్ వీడియో
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. దర్శకుడిగా 100కు పైగా చిత్రాలు తెరకెక్కించిన ఆయన ఎప్పుడూ తెర వెనుకనే ఉండేవారు. నటుడిగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ లేటు వయసులో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ కెమెరా ముందుకు వచ్చారు.
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీలా జంటగా నటిస్తున్న చిత్రం పెళ్లి సందD. గౌరి రోనంకి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాఘవేంద్ర రావు కీలక పాత్రలో నటిస్తున్నారు. రాఘవేంద్ర రావు ఫస్ట్ లుక్ వీడియో తాజాగా విడుదలయింది.
దర్శకధీరుడు రాజమౌళి ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేశారు. 100 సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత మా మౌన ముని కెమెరా ముందుకు వస్తున్నారు. ఫస్ట్ లుక్ వీడియో ఇదిగో అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
ఆర్కే ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా బ్యానర్స్ లో మాధవి, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ వీడియోలో రాఘవేంద్ర రావు సూట్ ధరించి గమ్మత్తుగా కనిపిస్తున్నారు. ఆయన పాత్ర పేరు వశిష్ఠ.
కీరవాణి సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి దర్శకేంద్రుడు వశిష్ఠ పాత్రలో ఎలా నటించారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. రాఘవేంద్ర రావు,శ్రీకాంత్ కాంబోలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే టైటిల్ తో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇప్పుడు నటిస్తున్నాడు.
After directing over 100 films, our Mounamuni comes in front of the camera.. Here's the first look of @Ragavendraraoba garu as an actor, with #PelliSandaD. https://t.co/JZtORcdd0a#Roshann #SreeLeela @mmkeeravaani #GowriRonanki @arkamediaworks @Shobu_
— rajamouli ss (@ssrajamouli) July 30, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com