‘ఆర్ఆర్ఆర్’కు జక్కన్న రెడీ.. వర్కవుట్లు చేస్తున్న హీరోలు
Send us your feedback to audioarticles@vaarta.com
మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ ముందు వరుసలో ఉంది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఎనబై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కోవిడ్ 19 ప్రభావంతో ఆగింది. దాదాపు ఆరు నెలల పాటు ఆగిన షూటింగ్‌ను జక్కన్న మళ్లీ మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో అక్టోబర్ మొదటి వారం నుండి షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు కూడా చెప్పేశాడట. దీంతో వారిద్దరూ వర్కవుట్స్ మొదలు పెట్టేశారని సమాచారం. కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి పాత్రలో రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియా శరన్, అలియా భట్, సముద్రఖని సహా రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com