RRR: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్.. ఒక్క పాటకు రూ.3 కోట్లు

దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతున్న మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. కేవలం ఒక్క సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ముందుగా ప్రకటించిన విధంగానే అక్టోబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా బయటకు వచ్చిన ఓ న్యూస్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. మిగిలి ఉన్న ఒక్క సాంగ్ ని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని విధంగా జక్కన్న షూట్ చేయబోతున్నారట. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ 3 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నటీనటుల కాస్ట్యూమ్స్ కోసమే కోటి రూపాయలు ఖర్చయినట్లు టాక్.

ఈ సాంగ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ తో పాటు అలియా భట్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్లే. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్మ మాత్రమే ఉంటుంది. గురువారం నుంచి ఆర్ ఆర్ ఆర్ టీం ప్రమోషన్స్ కూడా ప్రారంభించబోతోంది. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో రేపు ఉదయం 11 గంటలకు మేకింగ్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు.

కొమరం భీం, అల్లూరి చరిత్రలో స్నేహితులుగా ఉండి ఉంటే అనే ఆక్తికరమైన కల్పిత పాయింట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.