మడతేసి తికమక పెడుతున్న జక్కన్న.. దోస్తీ సాంగ్ లో వీటిని గమనించారా ?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆదివారం ఫ్రెండ్ షిప్ డే సంధర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి దోస్తీ సాంగ్ విడుదలయింది. ప్రమోషన్స్ కోసం మ్యూజిక్ వీడియో రూపంలో ఈ పాటని విడుదల చేశారు. కొద్ది సేపటికే ఈ పాట తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా భాషా భేదం లేకుండా ఇంటర్నెట్ లో దావానలం లాగా అంటుకుంది.
ఇదేదో రాజమౌళి బాహుబలి తర్వాత చేస్తున్న చిత్రం కాబట్టి.. రాంచరణ్, ఎన్టీఆర్ తొలిసారి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ కాబట్టి.. అలియా, అజయ్ లాంటి బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు కాబట్టి ఈ సాంగ్ వైరల్ కాలేదు. అంతటి మ్యాటర్ పాటలో ఉంది.
కీరవాణి సంగీత సారధ్యంలో వివిధ భాషలకు చెందిన స్టార్ సింగర్స్ పెర్ఫామెన్స్ తో పాట అదిరిపోయింది. అందులో డౌటే లేదు. కానీ జక్కన్న ఈ సాంగ్ తో కథపై ప్రేక్షకులని బాగా తికమక పెట్టేశాడు. రాసింది లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల. అయినప్పటికీ జక్కన్న ప్రమేయం ఉంటుందిగా. పాటలో కథ రివీల్ కాకుండా పవర్ ఫుల్ గా ఉండాలని జక్కన్న సిరివెన్నెల సూచించి ఉంటారు.
దీనితో సిరివెన్నెల తన అనుభవం అంతా రంగరించి పవర్ ఫుల్ గా, ఎమోషనల్ గా, అర్థవంతంగా సాగే అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. ఇందులో కొన్ని లిరిక్స్ వహ్ అనిపిస్తుంటే..మరికొన్ని కథ విషయంలో తికమకపెడుతూ ఎగ్జైట్ మెంట్ పెంచేస్తున్నాయి.
'పులికి విలుకాడికి.. తలకి ఉరితాడుకి .. కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి.. రవికి మేఘానికి దోస్తీ..అంటూ సాగే సిరివెన్నెల లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో.. అంతే ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఏమాత్రం పొత్తు పొంతన లేని వాటికి దోస్తీ అంటూ రాంచరణ్, ఎన్టీఆర్ పాత్రల స్వభావాన్ని చెప్పకనే చెప్పారు.
'ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం.. ప్రాణానికి ప్రాణం ఇస్తుందా తీస్తోందా అంటూ' పాటలోనే ప్రేక్షకులకు ప్రశ్న సంధించారు. అంటే ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రల్లో మలుపులు ఏస్థాయిలో ఉండబోతున్నాయి ఊహించుకోవచ్చు. ఇక ఆ ఊహించని చిత్ర విచిత్రం ఏంటి.. వీరిద్దరూ ఏం చేయబోతున్నారు అనే ఆసక్తి ఎక్కువైపోతోంది.
'నడిచే దారి ఒకటే..వెతికేది మాత్రం వేరు' అని పాటలో ఉన్న మరో లైన్ కూడా కథ విషయంలో అభిమానులకు ఫజిల్ గా మారింది. ఏది ఏమైనా తొలి సాంగ్ తోనే రాజమౌళి అండ్ టీం సాలిడ్ కిక్ ఇచ్చారు. ఒకే కాలానికి చెందిన, ఒకరికి ఒకరు ఏమాత్రం సంబంధం లేని యోధులు అల్లూరి,కొమరం భీం. వారి జీవితాల్లో కొన్ని సారూప్యతల ఆధారంగా రాజమౌళి అల్లిన కల్పిత కథ ఈ చిత్రం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments