ఆ పాత్రకు చిరు ప్రాణం పోశారు: రాజమౌళి
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. బుధవారం (అక్టోబర్ 2) నాడు విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు తమ స్పందనను తెలియజేశారు. దర్శకధీరుడు రాజమౌళి సినిమా చూసిన తర్వాత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈయనతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు తమ స్పందనను తెలియజేశారు.
చిరంజీవిగారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు ప్రాణం పోశారు. మరుగున పడిన చరిత్రను ఆయన వెలికి తీశారు. జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తదితరులు కథలో ఒదిగిపోయారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో చరణ్, సురేందర్ రెడ్డిగారికి అభినందనలు - రాజమౌళి
సైరా చాలా బాగా నచ్చింది. చిరంజీవిగారు అమేజింగ్. సురేందర్ రెడ్డిగారు చక్కటి యాక్షన్ డ్రామాతో బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడక్షన్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్, ఇలా అన్నీ బావున్నాయి. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. తమన్నా నటన అద్భుతంగా ఉంది. రామ్‌చరణ్ టీమ్‌కు నా అభినందనలు - శోభు యార్లగడ్డ
ఈరోజు చరిత్ర మళ్లీ పుట్టింది. చిరంజీవి అయ్యింది. సురేందర్ రెడ్డి పనితీరు అద్భుతం. మెగాపవర్‌స్టార్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నా - హరీశ్ శంకర్
మన మెగాస్టార్‌ను పీరియడ్ డ్రామాలో చూడటం ఓ చక్కటి అనుభవం. బచ్చన్ సార్, సుదీప్, జగపతిబాబు, విజయ్‌సేతుపతి, తమన్నా వెండితెరపై గొప్పగా కనిపించారు. అద్భుతమైన విజువల్స్ తీసిన సురేందర్ రెడ్డిగారికి ఇతర టీమ్ సభ్యులకు అభినందనలు సినిమా చూస్తున్నప్పుడు గూజ్‌బామ్స్ వచ్చాయి. కొన్ని సన్నివేశాల సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నా - అల్లు శిరీష్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments