ఆ పాత్ర‌కు చిరు ప్రాణం పోశారు: రాజ‌మౌళి

  • IndiaGlitz, [Wednesday,October 02 2019]

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితగాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. బుధ‌వారం (అక్టోబ‌ర్ 2) నాడు విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాను చూసిన ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ స్పంద‌న‌ను తెలియజేశారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సినిమా చూసిన త‌ర్వాత ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈయ‌న‌తో పాటు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేశారు.

చిరంజీవిగారు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌కు ప్రాణం పోశారు. మ‌రుగున ప‌డిన చ‌రిత్ర‌ను ఆయ‌న వెలికి తీశారు. జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా త‌దిత‌రులు క‌థ‌లో ఒదిగిపోయారు. సినిమా అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించిన నేప‌థ్యంలో చ‌ర‌ణ్‌, సురేంద‌ర్ రెడ్డిగారికి అభినంద‌న‌లు - రాజ‌మౌళి

సైరా చాలా బాగా న‌చ్చింది. చిరంజీవిగారు అమేజింగ్‌. సురేంద‌ర్ రెడ్డిగారు చ‌క్క‌టి యాక్ష‌న్ డ్రామాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌, సినిమాటోగ్ర‌ఫీ, కాస్ట్యూమ్స్‌, ఇలా అన్నీ బావున్నాయి. ప్ర‌తి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. త‌మ‌న్నా న‌ట‌న అద్భుతంగా ఉంది. రామ్‌చ‌ర‌ణ్ టీమ్‌కు నా అభినంద‌న‌లు - శోభు యార్ల‌గ‌డ్డ

ఈరోజు చరిత్ర మ‌ళ్లీ పుట్టింది. చిరంజీవి అయ్యింది. సురేంద‌ర్ రెడ్డి ప‌నితీరు అద్భుతం. మెగాప‌వ‌ర్‌స్టార్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నా - హరీశ్ శంక‌ర్‌

మ‌న మెగాస్టార్‌ను పీరియ‌డ్ డ్రామాలో చూడ‌టం ఓ చ‌క్క‌టి అనుభ‌వం. బ‌చ్చ‌న్ సార్‌, సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్‌సేతుప‌తి, త‌మ‌న్నా వెండితెర‌పై గొప్ప‌గా క‌నిపించారు. అద్భుత‌మైన విజువ‌ల్స్ తీసిన సురేంద‌ర్ రెడ్డిగారికి ఇత‌ర టీమ్ స‌భ్యుల‌కు అభినంద‌న‌లు సినిమా చూస్తున్న‌ప్పుడు గూజ్‌బామ్స్ వ‌చ్చాయి. కొన్ని స‌న్నివేశాల స‌మ‌యంలో క‌న్నీళ్లు పెట్టుకున్నా - అల్లు శిరీష్‌

More News

'శ్రీవిష్ణు' హీరోగా 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్' చిత్రం

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

'మీనబజార్'., ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ చేసిన నిర్మాత సి.కళ్యాణ్

డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. మీనబజార్., టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం మంగళవారం జరిగింది. హీరో మధు సుధన్, హీరోయిన్ శ్రీజిత ఘోష్,

సైరా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

సైరా నర్సింహారెడ్డి చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.

జగన్ కు చంద్రబాబు లేఖ.. ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని డిమాండ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఉపాధి హామీ పనుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు...

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త అందించింది.