మా కోసం ఆయన తగ్గి, ఎన్నో మాటలు పడ్డారు.. చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద : రాజమౌళి వ్యాఖ్యలు
- IndiaGlitz, [Sunday,March 20 2022]
కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి .. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. టికెట్ల ధరల పెంపు కోసం కృషిచేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎంతో పలుమార్లు భేటీ అయ్యి, టికెట్ల ధరల పెంపునకు చిరంజీవి ఎంతో కృషి చేశారని రాజమౌళి ప్రశంసించారు. దీనిపై చాలామంది ఆయన్ను విమర్శించారు.. కానీ చిరంజీవి మాత్రం పట్టించుకోకుండా సినిమా కోసం ప్రయత్నించారని వెల్లడించారు.
తెలుగు సినీ పరిశ్రమ చిరంజీవికి రుణపడి ఉండాలన్నారు. సినీ పరిశ్రమని నెగ్గించడానికి ఆయన తగ్గి, ఎన్నో మాటలు పడ్డారని రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉండేందుకు చిరంజీవి ఇష్టపడరని, ఇండస్ట్రీ బిడ్డగా ఉండేందుకే ఇష్టపడతారని పేర్కొన్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, చిరంజీవి ట్రూ మెగాస్టార్ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. అలాగే టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జక్కన్న ధన్యవాదాలు తెలిపారు.
ఇకపోతే.. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరంజీవి గారిని చాలా మంది చాలా మాటలు అన్నారు... రకరకాల మాటలు అన్నారు.
— IndiaGlitz Telugu™ (@igtelugu) March 20, 2022
మమ్మల్ని నెగ్గించడానికి చిరంజీవి గారు తగ్గి అందరి దగ్గిర అన్ని మాటలు పడ్డారు.
ఆయనకి ఇండస్ట్రీ పెద్ద అనిపించుకువడం ఇష్టం ఉండదు... ఇండస్ట్రీ బిడ్డ అని పించుకోవడం ఇష్టం. ఇండస్ట్రీ ఆయనికి రుణపడి ఉండాలి?? #RRR pic.twitter.com/55EvC0PL2D