మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ యోచ‌న‌లో జ‌క్క‌న్న‌..?

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి.. ప్ర‌స్తుతం ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. బాహుబ‌లి సినిమాతో ఈయ‌న క్రియేట్ చేసిన సెన్సేష‌న్ ఆ రేంజ్‌లో ఉంది మ‌రి. ఇప్పుడు ఆయ‌న తెర‌కెక్కిన భారీ మ‌ల్టీస్టార‌ర్ 'ఆర్ఆర్ఆర్‌'. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానుంది. అయితే ఈలోపే రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా చేస్తాడ‌నే దానిపై ప‌లు ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. రాజ‌మౌళి త‌దుప‌రి చిత్రాన్ని కూడా భారీ మ‌ల్టీస్టార‌ర్‌గానే తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ మ‌ల్టీస్టార‌ర్‌లో ప్ర‌భాస్‌, మ‌హేశ్ వంటి స్టార్స్ న‌టించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే రాజ‌మౌళి, మ‌హేశ్ కాంబినేష‌న్‌లో సినిమా రావాల్సి ఉంది. అదే నిర్మాత‌తోనే రాజ‌మౌళి ఈ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడ‌ని, ఇందులో ప్ర‌భాస్ కూడా న‌టిస్తాడ‌నేది స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల్లో నిజా నిజాలు తెలియాలంటే మాత్రం వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆగాల్సిందే.