పైడిపల్లికి ఊపిరి తీయడం రాదనుకున్న రాజమౌళి
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ కలసి నటించిన సంచలన చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తెలుగు - తమిళ్ లో ఊపిరి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజైంది. ఇటు తెలుగు - అటు తమిళ్ లో ఊపిరి చిత్రానికి ఊహించిన దానికంటే అంతకు మించి...అనూహ్యమైన స్పందన లభిస్తుంది.
ఊపిరి చిత్రం పై సినీ విమర్శకులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి హృదయాన్ని కదిలిస్తున్న ఊపిరి చిత్రం పై దర్శకథీర రాజమౌళి స్పందించారు. ఇంతకీ రాజమౌళి ఏమన్నారంటే...నాకు నచ్చిన చిత్రాల్లో ఇన్ టచ్ బుల్స్ మూవీ ఒకటి. ఈ చిత్రాన్నినిజంగా వంశీ ఇంత అద్భుతంగా తెరకెక్కించగలడని అనుకోలేదు. కార్తీ బాగా నటించాడు. నాగార్జున గారు నిజమైన ట్రెండ్ సెట్టర్. ఊపిరి నిజమైన ఎంటర్ టైనర్. ఈ చిత్రాన్నిమిస్ కావద్దు అంటూ ట్విట్టర్ లో స్పందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com