పాత జ్ఞాప‌కాల నెమ‌రేసుకున్న రాజ‌మౌళి, ఎన్టీఆర్‌

  • IndiaGlitz, [Friday,September 27 2019]

ఆల్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈరోజు త‌మ పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకున్నారు. మ‌రి ఈరోజు అంత స్పెష‌లేంటనే వివారాల్లోకెళ్తే..ఈ రోజు సెప్టెంబ‌ర్ 27. ఈరోజు రాజ‌మౌళి డెబ్యూ డెరెక్ష‌న్ మూవీ స్టూడెంట్ నెంబ‌ర్ 1 విడుద‌లైన‌రోజుది. ఈ సినిమాలో హీరోగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించారు. ఈ సినిమాతో హీరోగా ఎన్టీఆర్ తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా విడుద‌లైన 18 సంవ‌త్స‌రాలకు వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేస్తుండ‌టం విశేషం. ఇది యాదృచ్చికంగానే జ‌రిగిన‌ప్ప‌టికీ ఈ స్టార్ డైరెక్ట‌ర్‌, హీరో త‌మ మ‌ధుర స్మృతుల‌ను నెమ‌రువేసుకున్నారు.

''యాదృచ్చికంగా జరిగినా 18 ఏళ్ల మేం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేశాం. ఫొటోను స‌న్నివేశంతో చిత్రీక‌రణ‌ను పూర్తి చేశాం. ఈ మ‌ధ్య కాలంలో చాలా మారింది. అయితే జ‌క్క‌న్న‌తో ప‌నిచేసే ప‌న్ మాత్రం మార‌లేదు'' అంటూ ఎన్టీఆర్ మెసేజ్‌ను పోస్ట్ చేశారు.
''18 ఏళ్ల ముందు స్టూడెంట్ నెంబర్ 1 నేడు విడుద‌లైంది. యాదృచ్చిక‌మైనా, మ‌ళ్లీ ఈరోజు మేం రామోజీ ఫిలింసిటీలోనే ఉన్నాం. చాలా మార్పు జ‌రిగింది. త‌ను స‌న్న‌బ‌డ్డాడు. నాకు వ‌య‌సైంది'' అంటూ రాజ‌మౌళి ఓ ఫొటోతో పాటు మెసేజ్‌ను పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌. ఆర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఫాంట‌సీ మూవీ ఇది.

More News

బీజేపీలోకి విజయశాంతి.. దసరా రోజు కాషాయతీర్థం!

తెలంగాణలో అంతంత మాత్రమే ఉన్న కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగలనుందా..? కాంగ్రెస్‌కు ‘చేయి’చ్చి..

మొత్తం మేమే చేశాం.. సీఎంగా జగన్ చేసిందేంటి!

టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకొస్తే చాలు.. అది మేమే.. ఇది మేమే ఆ ఘనత మాదే..

తొలి పార్టీగా ‘ఎంఐఎం’ ఆల్‌టైమ్ రికార్డ్!

రాజకీయ పార్టీలు రాణించాలంటే సోషల్ మీడియా ఏ విధమైన కీలకపాత్ర పోషిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా పేరులో మార్పు

`నాపేరుసూర్య నా ఇల్లు ఇండియా` సినిమా త‌ర్వాత బ‌న్నీ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `అల‌.. వైకుంఠ‌పుర‌ములో..`.

చిరంజీవి - కొరటాల చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం ‘సైరా’ తర్వాత.. టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో