ఆర్.ఆర్. ఆర్....11.11.11న!
Send us your feedback to audioarticles@vaarta.com
`ఆర్.ఆర్.ఆర్.` అనే మాట ఎవరి నోట విన్నా అందరూ ప్రత్యేకించి చెవులు అప్పగించి మరీ వింటున్నారు. ఈ సినిమా గురించి ఏ క్షణాల ఏ కొత్త విషయం వినిపిస్తుందోనని. నందమూరి అభిమానులు, మెగా అభిమానులు జక్కన్న రాజమౌళి సాక్షిగా కలిసి చేసుకుబోతున్న పండుగ ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు సినిమాను ప్రారంభించడానికి నిర్మాత డీవీవీ దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.
ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే పలు భారీ సెట్లను కూడా వేశారు. ఎన్టీఆర్, రామ్చరణ్కు జోడీగా ఎవరు నటిస్తారు? ఇతర టెక్నీషియన్ల మాటేమిటన్న సంగతి ఇంకా బయటపెట్టలేదు. అయితే కీరవాణి సంగీతాన్ని, కె.కె.సెంథిల్ కెమెరాను, రమారాజమౌళి కాస్ట్యూమ్స్ విభాగాన్ని చూసుకుంటారు. రాజమౌళి రెగ్యులర్ టీమ్ ఎప్పటి నుంచో ఈ సినిమా మీద కృషి మొదలుపెట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com