ఆర్‌.ఆర్‌. ఆర్‌....11.11.11న‌!

  • IndiaGlitz, [Saturday,November 03 2018]

'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' అనే మాట ఎవ‌రి నోట విన్నా అంద‌రూ ప్ర‌త్యేకించి చెవులు అప్ప‌గించి మ‌రీ వింటున్నారు. ఈ సినిమా గురించి ఏ క్ష‌ణాల ఏ కొత్త విష‌యం వినిపిస్తుందోన‌ని. నంద‌మూరి అభిమానులు, మెగా అభిమానులు జ‌క్క‌న్న రాజ‌మౌళి సాక్షిగా క‌లిసి చేసుకుబోతున్న పండుగ ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 11న ఉద‌యం 11 గంట‌ల‌కు సినిమాను ప్రారంభించ‌డానికి నిర్మాత డీవీవీ దాన‌య్య స‌న్నాహాలు చేస్తున్నారు.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చాయి. ఇప్ప‌టికే ప‌లు భారీ సెట్ల‌ను కూడా వేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా ఎవ‌రు న‌టిస్తారు? ఇత‌ర టెక్నీషియ‌న్ల మాటేమిట‌న్న సంగ‌తి ఇంకా బ‌య‌ట‌పెట్ట‌లేదు. అయితే కీర‌వాణి సంగీతాన్ని, కె.కె.సెంథిల్ కెమెరాను, ర‌మారాజ‌మౌళి కాస్ట్యూమ్స్ విభాగాన్ని చూసుకుంటారు. రాజ‌మౌళి రెగ్యుల‌ర్ టీమ్ ఎప్ప‌టి నుంచో ఈ సినిమా మీద కృషి మొద‌లుపెట్టింది.

More News

మా సినిమా ని చూడండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు - 'అదుగో' ప్రెస్ మీట్ లో రవిబాబు..!!

పంది పిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో ద‌ర్శ‌కుడు ర‌విబాబు తెర‌కెక్కించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం 'అదుగో'.. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'దేవ్' టీజ‌ర్ అప్పుడే...

'ఖాకి' సినిమాతో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట మ‌రోసారి 'దేవ్' చిత్రంలో క‌నువిందు చేయ‌బోతున్నారు.

మ‌హేశ్ త‌ర్వాత ప్ర‌భాస్‌తోనే...

వైవిధ్య‌మైన సినిమాలు తీస్తూ ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు సుకుమార్‌. రీసెంట్‌గా రామ్‌చ‌ర‌ణ్‌తో సుకుమార్ చేసిన 'రంగ‌స్థ‌లం' చాలా పెద్ద హిట్ అయ్యింది.

ఎటువైపో నీ పరుగు ప్రారంభం

క్రాంతి, పృధ్వి, అవంతిక హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఎటువైపో నీ పరుగు. మద్దినేని రమేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.

త‌మ‌న్ సెంచ‌రీ...

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ జోరుమీదున్నాడు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌మ‌న్ ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు. త‌క్కువ స‌మ‌యంలోనే వంద సినిమాల‌కు సంగీతాన్ని అందించేశాడ‌ట త‌మ‌న్‌.