'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీలో రాజమౌళి తగ్గేది లే!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌తో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది. రాజమౌళి మనసు మారలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2022కి వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్టు వున్నాడు. దసరాకు సినిమాను విడుదల చెయ్యాలని బలంగా ఫిక్సయ్యాడు. పోస్టర్ మీద రిలీజ్ డేట్ మార్చలేదు. అక్టోబర్ 13, 2021కి సినిమా రిలీజ్ అని ఇచ్చాడు.
'ఆర్ఆర్ఆర్' షూట్ కంప్లీట్ అవ్వలేదు. బ్యాలన్స్ వర్క్ 40 డేస్ వున్నట్టు ఫిలింనగర్ టాక్. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇప్పట్లో షూటింగ్స్ స్టార్ట్ అవ్వడం కష్టంగా వుంది. అందుకని, సినిమా సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యిందని గుసగుసలు వినిపించాయి. సమ్మర్ సీజన్ కి వెళ్లే ఛాన్స్ వుందని అన్నారు. ఇప్పటికి రాజమౌళి అయితే దసరా సీజన్ మీద టార్గెట్ చేశారు. జూలై నాటికి కరోనా తగ్గుముఖం పట్టి తర్వాత షూటింగ్ చేస్తే అక్టోబర్ కి కంప్లీట్ చెయ్యడం కష్టం కాదు. కాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చెయ్యడం టాస్క్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com