హాలీవుడ్ స్టూడియోతో రాజమౌళి నెక్స్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
'బాహుబలి'తో రాజమౌళి రేంజ్ మారింది. నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్ళారు. ఇండియాలో బాహుబలి ఏ రేంజ్ సక్సెస్ అయ్యిందో టాలీవుడ్ ఆడియన్స్‌కి తెలుసు. జపాన్‌లోనూ హ్యుజ్ సక్సెస్ అయ్యింది. 'బాహుబలి' తరువాత రాజమౌళిది ఇంటర్నేషనల్ లెవల్ అని పోగిడినోళ్ళు ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక రోజు హాలీవుడ్ వెళతాడని అన్నారు. నిజంగా, ఇప్పుడు రాజమౌళి హాలీవుడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు.
ఇదీ చదవండి: బాలయ్యకు కోపం ఎక్కువే.. ఖైదీ, సైరా మధ్యలో ఏం జరిగిందంటే..
'బాహుబలి' తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' తీస్తున్నాడు. దాని తరువాత ఇంటర్నేషనల్ ఫ్లాట్ఫార్మ్స్ కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లైవ్ యానిమేషన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇండియన్ కంటెంట్ తీసుకుని హాలీవుడ్ స్టూడియోతో కలిసి భారీ సినిమా ప్లాన్ చేశాడు రాజమౌళి.
రాజమౌళికి మహాభారతం తీయాలని కోరిక. దానికి భారీ బడ్జెట్, ఎక్స్పీరియన్స్ అవసరమని గతంలో చెప్పాడు. ఇప్పుడు రాజమౌళికి అనుభవం ఉంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బడ్జెట్ సినిమాలు తీశాడు. 'బాహుబలి' సక్సెస్ తో రాజమౌళిపై ప్రొడ్యూసర్స్ కి కాన్ఫిడెన్స్ వచ్చింది. రాజమౌళి టాలెంట్మ చూశాక.. మహాభారతం తీయడానికి కావాల్సిన బడ్జెట్ ఇవ్వడానికి హాలీవుడ్ స్టూడియోలు రెడీగా ఉంటాయి. హాలీవుడ్ స్టూడియోతో రాజమౌళి మహాభారతం తీస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com