రాజమౌళి సినిమా అప్‌డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి క్రేజ్ ప్రపంచాన్ని తాకింది. ఇప్పుడు ఆయన ఎలాంటి సినిమా తీయబోతున్నాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంచనాలకు అందుకునేలా ఈసారి రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లతో మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమా అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపించిన నేపథ్యంలో.. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు సినిమా నవంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఓ పెద్ద ప్లేస్‌ను కూడా రెండేళ్ల పాటు రాజమౌళి అండ్ టీమ్ లీజుకు తీసుకుందట. దానయ్య డి.వి.వి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com