ప్రభాస్ లుక్ లోకి మారిపోయిన బెల్లంకొండ.. లాంచ్ చేసిన రాజమౌళి!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రాజమౌళిల బ్లాక్ బస్టర్ హిట్ ఛత్రపతి రీమేక్ తో శ్రీనివాస్ బిటౌన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. శుక్రవారం ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బెల్లకొండ శ్రీనివాస్ తన హార్డ్ వర్క్ తో టాలీవుడ్ లో గుర్తింపు ఏర్పరుచుకోవడమే కాదు.. మాస్ లో కొంత బేస్ కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఓ సాలిడ్ హిట్ శ్రీనివాస్ కి ఇంకా దక్కలేదు. బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తో అయినా తన బ్లాక్ బస్టర్ కోరిక నెరవేరుతుందని శ్రీనివాస్ ఆశలు పెట్టుకుని ఉన్నాడు.
రాజమౌళి, ప్రభాస్ కాంబోలో 2005లో తెరకెక్కిన ఛత్రపతి చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో రాజమౌళి మార్క్ ఎలివేషన్స్, ప్రభాస్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. అలాంటి చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే నార్త్ ప్రేక్షకుల్లో బాగా రీచ్ ఉంటుందని బెల్లంకొండ శ్రీనివాస్ భావించాడు.
దీనితో తనని అల్లుడు శీనుతో లాంచ్ చేసిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్ నే ఛత్రపతి రీమేక్ కోసం ఎంచుకున్నాడు. నేడు ఈ చిత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాస్ పై రాజమౌళి తొలి క్లాప్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వివి వినాయక్ తో పాటు విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం పాల్గొన్నారు. బెల్లకొండ శ్రీనివాస్ పూర్తిగా ప్రభాస్ లాగా మారిపోయే ప్రయత్నం చేశాడు. ఛత్రపతి చిత్రంలో ప్రభాస్ హాఫ్ హ్యాండ్స్ షర్ట్, మెడలో చిన్న శంఖంతో కనిపించడం అందరం చూశాం. ఛత్రపతి రీమేక్ లాంచింగ్ ఈవెంట్ లో బెల్లంకొండ కూడా అదే లుక్ తో దర్శనమిచ్చాడు.
విజయేంద్ర ప్రసాద్ ఛత్రపతి రీమేక్ కోసం నార్త్ నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేస్తున్నారు. తనిష్క్ బాగ్చి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై ధావల్ జయంతిలాల్ గాద, అక్షయ్ జయంతిలాల్ గాద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments