చెప్ప‌క‌నే చెప్పేసిన ద‌ర్శ‌క‌ధీరుడు

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'RRR'.ఈ సినిమాను 2020 జూలై 30న విడుద‌ల చేస్తామ‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అలాగే సినిమా ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుందని తెలిపారు. అయితే త‌ర్వాత అధికారిక ప్ర‌క‌ట‌న‌లో మాత్రం విడుద‌ల తేదీపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. రీసెంట్‌గా జ‌రిగిన 'మ‌త్తు వ‌ద‌ల‌రా' ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న రాజ‌మౌళిని 'RRR' విడుద‌ల‌పై సుమ ప్ర‌శ్నించింది. దీనిపై ఆయ‌న స్పందిస్తూ ''వీళ్లు మూడు సంత్స‌రాలు సినిమా తీస్తే(మ‌త్తు వ‌ద‌ల‌రా టీమ్‌ను ఉద్దేశించి) త‌ప్పులేదు కానీ.. నేను చేయ‌కూడ‌దా'' అని న‌వ్వుతూ! బ‌దులిచ్చాడు రాజ‌మౌళి. మీ టైటిల్‌లో మూడు ఆర్ లు ఉన్నాయి కాబ‌ట్టి మూడేళ్లు అయినా త‌ప్పులేదండి అంటూ సుమ చ‌మ‌త్క‌రించింది.

రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ జీవితాల‌కు సంబంధించిన క‌ల్పిక‌గాథ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాను 10 భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

పౌరసత్వ బిల్లు: మరణం వస్తే మీకంటే ముందు నేనే..!

భారతదేశంలో ప్రతి ఒక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపీ పిలుపునిచ్చారు.

ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతున్న ఆది సాయికుమార్

హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు . పుట్టిన రోజు సందర్భంగా

అంగరంగ వైభవంగా వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బుల్లి తెర అవార్డ్స్ ప్రధానోత్సవం

వి.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే.

'నమస్తే నేస్తమా` త‌ప్ప‌కుండా సూప‌ర్ హిట్ అవుతుంది - ద‌ర్శ‌క నిర్మాత కె.సి.బొకాడియ

కె.సి.బొకాడియ...చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో  స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి

రాజధాని భూములపై లెక్కలు చెప్పిన నాగబాబు!

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనను చాలా వరకు స్వాగతించగా..