ఆ క్రెడిట్ తన కొడుక్కే ఇచ్చిన రాజమౌళి.. దోస్తీ సాంగ్ పై తొలిసారి..
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనాలు మొదలు పెట్టింది. ఆదివారం విడుదల చేసిన దోస్తీ సాంగ్ అన్ని భాషల్లోనూ అదరగొడుతోంది. ఇప్పటికే దోస్తీ సాంగ్ కి 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి..
ఇదీ చదవండి: క్రేజీ థ్రిల్లర్ చిత్రానికి రూ. 100 కోట్ల బడ్జెట్
దోస్తీ సాంగ్ పై రాజమౌళి తొలిసారి స్పందించారు. ఈ సాంగ్ క్రెడిట్ ని జక్కన్న తన తనయుడు కార్తికేయకే ఇచ్చాడు. దోస్తీ మ్యూజిక్ సాంగ్ షూట్ ఐడియా కార్తికేయదే అట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపాడు. తాను ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ సాంగ్ షూట్ లో బిజీగా ఉండడంతో దోస్తీ మ్యూజిక్ వీడియో షూట్ మొత్తం కార్తికేయ, కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్, దినేష్ కృష్ణన్ ఈ సాంగ్ ని రూపొందించారని రాజమౌళి అన్నారు.
ఈ సందర్భంగా ఇంత అద్భుతమైన సాంగ్ చేసిన తన పెద్దన్న కీరవాణికి, లిరిక్స్ అందించిన సిరివెన్నెల గారికి రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. తమ బిజీ షెడ్యూల్ లో కూడా దోస్తీ సాంగ్ ని పాడి, షూట్ లో పాల్గొన్న అనిరుధ్, అమిత్ త్రివేది లకు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన సింగర్స్ హేమచంద్ర, యాజిన్ నిజార్, విజయ్ ఏసుదాస్ లని కూడా జక్కన్న ప్రశంసించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం దోస్తీ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ లో నిలిచింది. ఇక ఆర్ఆర్ఆర్ టీం చివరి సాంగ్ షూట్ కోసం ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తయినట్లు అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకుని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవడమే ఆలస్యం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com