టైమ్ లైన్ ఫిక్స్ చేసుకున్న జక్కన్న...!
Send us your feedback to audioarticles@vaarta.com
మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ ప్యాన్ ఇండియా ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’. ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇందులో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తుంటే, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన కల్పిత కథాంశంతో రూపొందుతోన్న చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా.. సినిమా విడుదలకు కరెక్ట్‌గా దాదాపు ఎనిమిది నెలల సమయం ఉంది. సెన్సార్, ప్రమోషన్స్ అన్నీ పోనూ ఏడు నెలల సమయం మాత్రమే ఉండొచ్చు. మరి ఈ టైమ్ లైన్‌ను రీచ్ కావాలంటే.. రాజమౌళి స్పీడు మరింత పెంచాలని నిర్ణయించుకున్నాడట. మార్చి చివరికంతా ప్యాచ్ వర్క్ సహా ఎంటైర్ షూటింగ్‌ను పూర్తి చేయాలని డిసైడయ్యాడట జక్కన్న. తర్వాత ఆరు నెలల పాటు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే కూర్చోవాలనుకుంటున్నాడట. కోవిడ్ ప్రభావంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం కావడంతో ఇక టైమ్ లైన్ పెట్టుకుని పని చేసుకోవాల్సింది వస్తుంది జక్కన్న.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout