ఎన్టీఆర్ బ‌ర్త్ డే ట్రీట్ డౌటే!!

  • IndiaGlitz, [Saturday,April 18 2020]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా భీమ్ ఫ‌ర్ రామ‌రాజు అంటూ చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించి వీడియో ప్రోమోను విడుద‌ల చేశారు. ఐదు భాష‌ల్లో మ‌ల‌యాళం త‌ప్ప అన్నీ భాష‌ల్లో ఈ వీడియో ప్రోమోలో చ‌ర‌ణ్ పాత్ర‌కు తార‌క్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. తార‌క్ వాయిస్ ఓవ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇప్పుడు ఎన్టీఆర్ వంతుగా మే 20న రామ‌రాజు ఫ‌ర్ భీమ్ వీడియో ప్రోమో విడుద‌ల‌వుతుంద‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రాజ‌మౌళి అండ్ టీం కూడా వీడియో ప్రోమో డైలాగ్స్ స‌హా అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే కొంత షూటింగ్ చేసుకోవాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ దృష్ట్యా షూటింగ్ జ‌రుపుకోలేక‌పోవ‌డం. ఉన్న మెటీరియ‌ల్ అంతా ఆఫీసుల్లోనే నిక్షిప్త‌మై ఉండ‌టం వారిని కంగారు పెడుతుంది. అయితే ఎవ‌రి కోస‌మో, ఏదో చేసేయాల‌నో తాను ప్రొడ‌క్ట్ క్వాలిటీలో కాంప్ర‌మైజ్ కాన‌ని, అంతా త‌న‌కు సంతృప్తిక‌రంగా అనిపించిన‌ప్పుడే రామ‌రాజు ఫ‌ర్ భీమ్ విడుద‌ల చేస్తాన‌ని రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు మే త‌ర్వాత లాక్ డౌన్ కొన‌సాగితే ఎన్టీఆర్ త‌న ఫ్యాన్స్‌కు ఆర్ఆర్ఆర్ ట్రీట్ ఇవ్వ‌డం క‌ష్ట‌మేన‌నిపిస్తోంది.

More News

జ‌క్క‌న్న‌తో మ‌హేశ్ ఫిక్స్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అభిమానుల‌ను చాలా రోజులుగా వేధిస్తోన్న ప్ర‌శ్న‌.. త‌మ అభిమాన హీరోతో ఆల్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా ఎప్పుడు చేస్తాడు? అని. బాహుబ‌లి స‌మ‌యంలో

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌పై రాజ‌మౌళి సందేహం?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

చైత‌న్య నెక్ట్స్ ఆ ద‌ర్శ‌కుడితోనేనా..?

అక్కినేని నాగ‌చైత‌న్య సెన్సిటివ్ స‌బ్జెక్ట్స్‌ను డీల్ చేసే డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమాలో న‌టిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది.

మహేశ్ లవ్‌స్టోరీ.. మ్యూజిక్ ఎవ‌రంటే?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా

శ్రియ‌పై సిల్లీ కామెంట్స్‌.. ఆమె భ‌ర్త ఏమ‌న్నాడంటే..?

తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన శ్రియ ఇప్పుడు త‌న ల‌వ‌ర్ అండ్రూ కొచ్చిన్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది. వీరిద్ద‌రూ స్పెయిన‌ల్‌లో క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.