Rajamouli: ప్రభుదేవా పాటకు భార్యతో కలిసి రాజమౌళి డ్యాన్స్ రిహార్సల్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి, RRR సినిమాలతో దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తన సినిమాలతో అభిమానులను కట్టిపడేయటంలో ఆయనకు ఆయనే సాటి. రోమాలు నిక్కబొడ్చేలా సన్నివేశాలు తెరకెక్కించడంలో జక్కన్నను మించిన దర్శకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. అందుకే తన సినిమాలు ఒక్కటి కూడా ఇంతవరకు ఫ్లాప్ కాలేదు. అంతలా తాను తీసే సినిమాల కోసం కష్టపడుతుంటారు. సినిమా షూటింగ్ మొదలైన దగ్గరి నుంచి జక్కన్న హీరోలు రెండు, మూడు సంవత్సరాల పాటు స్ట్రీట్‌గా ఉండాల్సిందే.
సినిమాల షూటింగ్‌లలో తమను చిత్ర హింసలు పెడతాడంటూ రాజమౌళి గురించి హీరోలు సరదాగా చెబుతూ ఉంటారు. అయితే సినిమా షూటింగ్‌ల వరకే జక్కన్న సీరియస్‌గా ఉంటారు. బయట మాత్రం చాలా సరదాగా గడుపుతుంటాడు. మూవీ ప్రమోషన్లలో కానీ, సినిమా ఈవెంట్స్‌లో జోక్‌లు వేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. అలాగే సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో కలిసి వెకేషన్‌కి వెళ్తుంటారు. ఇక రీసెంట్‌గా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఈ డ్యాన్స్ కోసం రాజమౌళి రిహార్సల్ చేసిన వీడియో బయటికి వచ్చింది.
లెజెండ్ దర్శకడు శంకర్ దర్శకత్వం వహించిన ప్రేమికుడు సినిమాలోని 'అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే' పాటకి తన భార్య రమాతో కలిసి రాజమౌళి రిహార్సల్స్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు జక్కన్నలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరెందుకు ఇక నుంచి మీ సినిమాలకు కొరియోగ్రఫీ కూడా మీరే చేయండని కామెంట్స్ చేస్తున్నారు. ఓసారి మీరు కూడా జక్కన్న డ్యాన్స్ రిహార్సల్స్ చూసి ఎంజాయ్ చేయండి.
ఇదిలా ఉంటే రాజమౌళి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యాక్షన్ అడ్వెంచర్‌గా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.ఈ మూవీ కోసం మహేష్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం 2026లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరి మహేష్ మూవీతో రాజమౌళి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.
Mr. Perfectionist @ssrajamouli 👌🙌🤩🤩 pic.twitter.com/zEAV9hPnZn
— IndiaGlitz Telugu™ (@igtelugu) April 11, 2024
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com