'గౌతమిపుత్ర శాతకర్ణి' ని అభినందించిన దర్శకధీరుడు....

  • IndiaGlitz, [Thursday,January 12 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాల‌య్య 100వ సినిమా 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి'. భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా, భారీ అంచ‌నాలు మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమాకు ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ముఖ్యంగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ సినిమా ప్రీమియ‌ర్ షోకు ప్ర‌త్యేకంగా హాజ‌ర‌య్యారు. సినిమా చూసిన అనంత‌రం త‌న‌దైన శైళిలో సినిమాపై ప‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. సాహో నంద‌మూరి బాల‌కృష్ణ‌గారు. శాత‌క‌ర్ణి రోల్ చేసినందుకు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పైనుండి ఆశీస్సులు అందిస్తారు, గ‌ర్వంగా ఫీల‌వుతారు.
12కోట్ల తెలుగు ప్ర‌జలు స‌హా ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లు ఆశీస్సుల మీకెప్పుడూ ఉంటాయి. ఇలాంటి గొప్ప సినిమాను 79 రోజుల్లో ఎలా తీశారు న‌మ్మ‌శ‌క్యంగా లేదు. నేను ఈ సినిమా చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి. సాయిమాధ‌వ్‌గారి పెన్, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి క‌త్తి అయ్యింది. ఎక్స‌లెంట్ సినిమాటోగ్ర‌ఫీ, అద్భుత‌మైన ప్రొడక్ష‌న్ వాల్యూస్ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని గొప్ప చిత్రంగా, క‌ల‌కాలం నిలిచిపోయేలా చేశాయంటూ రాజ‌మౌళి చిత్ర యూనిట్‌ను ప్ర‌శంసించారు.