బాహుబలి 1..2..3
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన సంచలన చిత్రం బాహుబలి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లు వసూలు చేసి ఎవరు ఊహించని సరికొత్త రికార్డు స్రుష్టించింది బాహుబలి. ఇక అసలు విషయానికి వస్తే..బాహుబలి 1..2..3 అంటున్నారు. బాహుబలి 2 తర్వాత బాహుబలి 3 తీస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్టే.
మేటర్ ఏమిటంటే...బాహుబలి 1 చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించి మలయాళ, హిందీ భాషల్లో డబ్ చేసారు. ఇప్పుడు బాహుబలి 2 చిత్రాన్ని తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా షూట్ చేస్తారట. బాహుబలి 2 హిందీ కోసం బాలీవుడ్ టాప్ రైటర్స్ వర్క్ చేయనున్నట్టు సమాచారం.బాహుబలి 1 చిత్రాన్ని తెలుగు, తమిళ్..2 భాషల్లో చిత్రీకరించారు. బాహుబలి 2 చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ...3 భాషల్లో చిత్రీకరిస్తున్నారు. బాహుబలి 3 తీస్తే...4 భాషల్లో రూపొందిస్తారేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments