మాక్ షూట్‌కి జక్కన్న అండ్ టీమ్
- IndiaGlitz, [Saturday,June 13 2020]
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిపై రెండు తెలుగు ప్రభుత్వాలు పెద్ద బాధ్యతనే పెట్టాయనుకోవాలి. ఎందుకంటే కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. రెండు నెలల తర్వాత ప్రభుత్వాలు సినిమాల షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చాయి. అయితే విధి విధానాలను కఠినంగా రూపొందించాయి. రెండు వందల మందితో షూటింగ్ చేయాల్సిన సన్నివేశాలను యాబై మందితో చేసుకోమని సలహా ఇచ్చింది. ఇది చాలా మంది దర్శక నిర్మాతలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ సమయంలో రాజమౌళి తాను ఎన్టీఆర్, చరణ్‌లతో చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను ప్రభుత్వ విధి విధానాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే వారం సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని టాక్.
ఈ మాక్ షూటింగ్‌ను రెండు ప్రభుత్వాల పెద్దలకు చూపిస్తారు. అదే సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్స్ చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయనడంలో సందేహం లేదు. వాటిని ఎలా అధిగమించాలి. వాటికి అనుగుణంగా ప్రభుత్వాలు రూల్స్‌లో ఎలాంటి మార్పులు చేయాలనేది ఆలోచన చేస్తారట. మరి జక్కన్న అండ్ టీమ్ చేసే ప్రయత్నం ఎంత వరకు పలిస్తుందో చూడాలి.