నిర్మాతలుగా మారుతున్న రాజమౌళి, ప్రభాస్?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు స్టార్ హీరోలందరికీ దాదాపు స్వంత నిర్మాణ సంస్థలున్నాయి. ఎన్టీఆర్‌కు అన్నయ్య కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉండనే ఉంది. కాగా..త్వరలోనే ఎన్టీఆర్ కూడా ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి. ఇక ప్రభాస్..యువీ క్రియేషన్స్‌లో పార్ట్‌నర్ అని వార్తలు వినపడుతూనే ఉన్నాయి. కాగా.. ప్రభాస్ మరో నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్. వివరాల్లోకెళ్తే, ప్రభాస్‌కు డైరెక్టర్ రాజమౌళికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే వీరిద్దరూ కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేస్తారని టాక్.
ప్రస్తుతం ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ముగిసిన తర్వాత తదుపరి సినిమా స్టార్ట్ అయ్యేలోపు ప్రభాస్ రాజమౌళితో కలిసి కొత్త బ్యానర్‌ను స్టార్ట్ చేస్తాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. మరి బ్యానర్‌లో ప్రభాస్ మాత్రమే హీరోగా నటిస్తాడా? లేక కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ కొత్త హీరోలను కూడా ఎంకరేజ్ చేస్తాడా అని తెలియడం లేదు. ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా చేయడానికి దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్ సహా పలు నిర్మాణ సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయి. ప్రభాస్ మాత్రం తన 20వ సినిమాపైనే ఫోకస్‌గా ఉన్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com