Salaar:"సలార్' ప్రమోషన్స్ షూరూ.. ప్రభాస్ కోసం రంగంలోకి రాజమౌళి..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశమంతా "సలార్' మేనియాతో ఊగిపోతుంది. ఎప్పుడెప్పుడు మూవీని వెండితెరపై చూద్దామని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎల్లుండే(శుక్రవారం) సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే చిత్రబృందం ఇంతవరకు సరైన ప్రమోషన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ ఓ ఇంటర్వ్యూ విడుదల చేసింది. అది కూడా దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్‌లని ఇంటర్వ్యూ చేసి పలు ప్రశ్నలు అడిగారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
సలార్ క్రేజ్ చూస్తే ఏమనిపిస్తుందంటూ దర్శకుడు ప్రశాంత్‌ను రాజమౌళి అడిగారు. దీనికి కాస్త టెన్షన్‌గా ఉందంటూ ఆయన బదులిచ్చాడు. "నేను ఇప్పటివరకు 4 సినిమాలు తీశాను.. కానీ ఏ సినిమా రిలీజ్‌కి ఇంత టెన్షన్ పడలేదు.. దానికి కారణం ఏంటంటే.. సలార్‌లో డ్రామా ఎక్కువ ఉంది.. నేను ఇంత డ్రామా ఎప్పుడూ ట్రై చేయలేదు.. అదే కాస్త టెన్షన్.. మీ సినిమాల్లో డ్రామా బాగా వర్కవుట్ అవుతుంది.. నాకు ఎలా అవుతుందో చూడాలి" అంటూ ప్రశాంత్ చెప్పాడు.
దీంతో రాజమౌళి మాట్లాడుతూ "డ్రామా అనేది ప్రభాస్‌తో బాగా వర్కవుట్ అవుతుంది.. దాని గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రభాస్ అలా వచ్చి నిల్చుంటే చాలు.. డ్రామా ఎంతసేపు అయినా జానాలు చూస్తూనే ఉంటారు.. ప్రభాస్‌కి అదే పెద్ద పాజిటివ్" అంటూ చెప్పారు. దీనికి వెంటనే ప్రభాస్ నవ్వుతూ "అయితే బాహుబలి-3 నాతో కన్ఫార్మ్ కదా" అనేశాడు. దీనికి జక్కన్న చెప్పిన ఆన్సర్ నవ్వులు తెప్పిస్తోంది. ఇక సినిమాలో ఎంత డ్రామా ఉందో అంత కంటే ఎక్కువ ఎలివేషన్స్ కూడా ఉన్నాయంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. ఇలా పలు అంశాలపై వీరంతా సరదాగా ముచ్చటించారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం కింద వీడియో చూడండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments