ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా గురించి జ‌క్క‌న్న ఏం చెప్పారంటే...!!

ఇండియ‌న్ సినిమాలో ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్. ఆయ‌నతో సినిమాలు చేయాల‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న్ని ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా ఏదైనా చేసే ఆలోచ‌న ఉందా? అని ప్ర‌శ్నించిప్పుడు రాజ‌మౌళి మాట్లాడుతూ ‘‘నేను గతంలో పవన్‌క‌ల్యాణ్‌గారిని ఓ సినిమా కోసం అప్రోచ్ అయ్యాను. అయితే అన్నీ అనుకున్న‌ట్లు కుద‌ర‌క‌పోవ‌డంతో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. చాలా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ రాసుకున్న‌ప్పుడు అన్నీ ప‌రిస్థితులు అనుకూలిస్తే త‌ప్ప ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేసే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నారు. సినిమాల‌కు త‌క్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు. మ‌రో ప‌క్క నేనెమో సినిమాలు చేయ‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంటున్నాను’’ అన్నారు.

రాజ‌మౌళి ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీ బ‌డ్జెట్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. కరోనా ప్ర‌భావం కార‌ణంగా పూణేలో జ‌ర‌గాల్సిన కీల‌క షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఆగిపోయింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత మే నెల‌లో షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది.

More News

మెగాఫ్యాన్స్ కంగారు

ఇప్పుడు మెగాఫ్యాన్స్ కంగారు ప‌డుతున్నార‌ట‌. అందుకు కార‌ణంగా మెగాస్టార్ చిరంజీవి ఓ డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నాన‌ని రీసెంట్‌గా ప్ర‌క‌టించ‌డ‌మే

తార‌క్‌, చెర్రీల‌కు రాజ‌మౌళి స‌వాల్‌

లాక్‌డౌన్ వేళ సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇళ్ల‌ల్లోకి ప‌ని మ‌నుషుల‌ను కూడా సెల‌బ్రిటీలు రానీయ‌డం లేదు స‌రిక‌దా! ఎవ‌రింటి ప‌నిని వారే చేసుకుంటున్నారు.

3 నెలలు ఇంటి అద్దె వసూలు చేయొద్దు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల పాటు ఇంటి అద్దె వసూలు చేయొద్దని ఓనర్స్‌కు సీఎం కేసీఆర్ ఒకింత వార్నింగ్.. విజ్ఞప్తి చేశారు.

బ్రేకింగ్: మే-07 వరకు లాక్‌డౌన్ పొడిగింపు : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం నాడు కేబినెట్ భేటీలో సుధీర్ఘంగా చర్చించిన అనంతరం తెలంగాణలో మే-07 వరకు

లాక్‌డౌన్ సడలింపుల్లేవ్.. మే-01 తర్వాత ఊరట : కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్-20 నుంచి లాక్ డౌన్‌ సడలింపులు ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం అలాంటి సడలింపులు ఏమీ ఉండవని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పేశారు.