Rajahmundry Rose Milk: 'రాజమండ్రి రోజ్ మిల్క్' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్యకాలంలో ఇలాంటి క్యూట్ టీజర్ చూడలేదు.. యూత్‌ఫుల్‌గా.. ఎంతో ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్న సినిమాలా అనిపిస్తుంది. ఈ చిత్రంలో తప్పకుండా సమ్‌థింగ్ స్పెషల్ వుంటుందనిపిస్తుంది అని అంటున్నారు రాజమండ్రి రోజ్ మిల్క్ టీజర్‌ను వీక్షించిన ప్రేక్షకులు. జై జాస్తి, అవంతిక జంటగా నటిస్తున్న చిత్రం రాజమండ్రి రోజ్‌మిల్క్ నాని బండ్రెడ్డి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి ఇంట్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.
దర్శకుడు మాట్లాడుతూ.. టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. కాలేజి రోజుల్లో మరపురాని సంఘటనలను, మధురానుభూతులను ఈ చిత్రం అందరికి జ్ఞప్తికి తెస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మంచి సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది అన్నారు.
సన్నీల్‌కుమార్, వెన్నెలకిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్,డిఓపీ: శక్తి అరవింద్, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments