Chandrababu Naidu:చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691.. జైలులో ప్రత్యేక వసతులు, ఇంటి భోజనానికి కోర్ట్ అనుమతి
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలప్‌మెంట్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఏసీబీ కోర్ట్. దీంతో ఆయనను ఆదివారం రాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అర్ధరాత్రి జైలుకు చేరుకున్న ఆయనకు అధికారులు ‘‘7691’’ నెంబర్‌ను కేటాయించారు. మరోవైపు జైలులో చంద్రబాబుకు మిగిలిన ఖైదీలలాగా కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఏసీబీ కోర్ట్ ఆదేశించింది. చంద్రబాబుకు జైలులో ప్రత్యేక గది ఏర్పాటు చేయడంతో పాటు భద్రత కల్పించనున్నారు. చంద్రబాబుకు ఇంటి భోజనంతో పాటు మందులను అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
చంద్రబాబు హౌస్ అరెస్ట్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ వాదనలు :
చంద్రబాబు హౌస్ అరెస్ట్‌కు అనుమతించాలని ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ వాదనలు జరగనున్నాయి. దీనితో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరగనున్నాయి. దీంతో ఏం జరుగుతుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అటు చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.
చంద్రబాబును చూసి కన్నీటి పర్యంతమైన భువనేశ్వరి :
మరోవైపు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏసీబీ కోర్ట్ హాల్ వద్దకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి చేరుకున్నారు. తమ పెళ్లి రోజునే భర్తకు రిమాండ్ విధించడంతో భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో చంద్రబాబు ఆమెను సముదాయించి ధైర్యం చెప్పి పంపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments