'నమ్మేలా లేదే' అంటున్న 'రాజావారు రాణిగారు'
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో బాగా హైలైట్ అయిన పేరు 'రాజావారు రాణిగారు'.పోస్టర్లతో టీజర్ తో జనాలలో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం గతవారమే మొదటి పాట ద్వారా ప్రజలకు మరింత చేరువైంది.రాజావారు రాణిగారు టైటిల్ సాంగ్ కు విశేషమైన స్పందన రావడంతో చిత్రబృందం ఈ సినిమా లోని రెండో పాటని కూడా విడుదల చేసారు.
జయ్ క్రిష్ సంగీత సారథ్యంలో రూపొందిన 'నమ్మేలా లేదే ..' అనే ఈ మెలోడీ కి కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.ముఖ్యంగా యూత్ ఈ పాటకి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనురాగ్ కులకర్ణి గాత్రం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. 'నమ్మేలా లేదే..కల కాదే.. మనసే మేఘమాయే' అంటూ సాగే ఈ పాట సాహిత్యపరంగా కూడా చాలా బావుండటం కలిసొచ్చే అంశం.
ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్ లు హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మనోవికాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com
Comments