'రాజా ది గ్రేట్' నిడివి ఎంతంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం రాజా ది గ్రేట్. వెల్‌కమ్ టు మై వరల్డ్ అనేది దీనికి ట్యాగ్‌లైన్. రవితేజ తొలిసారిగా అంధుడిగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మెహరీన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. సాయికార్తీక్ సంగీతమందించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్ పొందిన సంగతి తెలిసిందే. కాగా, 149 నిమిషాల (2 గంటల 29 నిమిషాల) నిడివితో రాజా ది గ్రేట్ ఉంటుందట. హై వోల్టేజ్ యాక్షన్, ఫన్ రైడ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై రవితేజ బోలెడు ఆశలనే పెట్టుకున్నాడు. బెంగాల్ టైగర్ తరువాత దాదాపు రెండేళ్ల గ్యాప్‌తో వస్తున్న ఈ చిత్రంతోనైనా రవితేజ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి. ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com